తెలంగాణలోని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది.

Advertisements

<p>తెలంగాణలోని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది&period; ఎన్నికల వాగ్దానం లో భాగంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా పథకం నిధులను ఈ నెల 22à°µ తేదీన విడుదల చేసేందుకు ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది&period; ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు&period; తొలి విడత నిధుల విడుదల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది రైతుల ఖాతాల్లో నేరుగా నగదు జమ కానుంది&period; ఈ నేపథ్యంలో రైతు భరోసాపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క&comma; మంత్రి తుమ్మల నాగేశ్వరరావు&comma; అధికారులతో కలసి సమావేశం నిర్వహించారు&period; సిద్దిపేట జిల్లా నర్మెట్ట నుంచి రైతు భరోసా నిధులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విడుదల చేయనున్నారు&period; ఈ మేరకు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క&comma; మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో చర్చించి సీఎం నిర్ణయం తీసుకున్నారు&period; తొలివిడతగా ఒక ఎకరం వరకు భూమి ఉన్న 70 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి నిధులు జమ చేయనున్నారు&period; దీని కోసం రూ&period;3&comma;590 కోట్ల నిధులు విడుదల చేయనున్నారు&period; రెండో విడతగా మరో 20 రోజుల తర్వాత 2&comma;650కోట్లు ప్రభుత్వం విడుదల చేయనుంది&period; ఏప్రిల్‌ నెలాఖరులోపు మూడో విడతగా మొత్తం రైతు భరోసా నిధులు విడుదల చేయనున్నారు&period; మూడు విడతల్లో కలిపి మొత్తంగా రూ&period;9 వేల కోట్ల మేర రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అంతరిక్ష రంగంలో తెలంగాణ గర్జన..

ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ నిర్మిస్తున్న ‘మండాడి’ షూటింగ్ పూర్తి.. శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు..

కోత సీజన్‌లో డీజిల్ కొరత.. రైతుల ఆందోళన..