పరమాత్మ ప్రక్రుతి అంతా నిండి ఉంటాడు. ఆయనను పలురూపాలుగా భావించి ధ్యానించే భక్తులకు ఆయన ఉనికిని అనేకానేక విధములుగా తెలియపరుస్తుంటాడు. భావన బలంగా ఉండాలి.అందుకే పెద్దలు శివుణ్ణి ఆరాధించాలంటే నీవు శివునిగా మారాలి అంటారు. అదే మహన్యాసం గా సాగుతుంది శివాభిషేకం లో ఇక్కడ శివతత్వాన్ని తన అన్ని అంగములలో భావన చేస్తాడు సాధకుడు. ఇక్కడ పీఠం లో జరుగుతున్న హనుమంతుని ఉపాసనా ,వచ్చేసాధకుల స్థితి ననుసరించి ఆయన అనుగ్రహప్రసారం ఎలాఉంటున్నదో అనేక ఉదాహరణలద్వారా అనుభవపూర్వకంగా తెలుసుకుంటూ ఉన్నాము. స్వామి ఉపాసనను చూసి పులకించి తామూ స్వామి భావాన్ని ధ్యానిస్తున్నాయేమో ఇక్కడ చెట్లు. తీయని ఫలములనిస్తున్న నేరేడు చెట్లు కూడా అలానే ధ్యానించి స్వామి పట్ల అపార ప్రేమతో ఉన్నాయో గాని ఓఫలం లో స్వామి రూపాన్ని ఆవిష్కరించాయి. ఈరోజు పూజసమయంలో నివేదన చేయటానికి మాతమ్ముడు పీఠం లో గల నేరేడు పండ్లు కోసితెచ్చాడు. అనుకోకుండా చేతిలో పండ్ల లో ఓ పండు హనుమ ముఖ రూపంతో కనపడింది. వేంటనే నాదగ్గరకొచ్చి చూపాడు. నల్లని నేరేడు ఫలానికి ఓవైపు ఎర్రని పెదవులుగా దానిపైన రెండు కన్నులుగా ప్రకృతిమాత చెక్కి ఇచ్చిన ఆరూపం . ఆనందాన్ని కలుగ జేసింది. ఆ ఫలాన్ని ఇచ్చిన చెట్టు స్వామిని ఎంతగా ధ్యానిస్తున్నదో కదా ! ఎంతటి అదృష్టమో కదా ఆవృక్షానిది.
ఈరోజు పూజాసమయం లో నేరేడు పండు లో హనుమ రూపం
134
previous post