50
ఏలూరు కోట దిబ్బలోని ట్రెజరీ కార్యాలయాన్ని ఏసీబీ అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనధికారంగా కొంత సొమ్ము 41 వేలు రూపాయలు సంబంధిత ఉద్యోగుల వద్ద దొరికినట్లుగా ప్రాథమిక నిర్ధారణ. టోల్ ఫ్రీ నెంబర్ అయిన 14400 నెంబర్ కు వచ్చిన ఫిర్యాదుల మేరకు మరియు కలెక్టర్ స్పందన ద్వారా వచ్చిన ఫిర్యాదులు మేరకు తనిఖీలు నిర్వహించాము. తనిఖీల్లో డి.ఎస్.పి పి శరత్ బాబు, ఇన్స్పెక్టర్స్ ఎన్ వి భాస్కర్, కే నాగేంద్రప్రసాద్, మరియు ఏసీబీ సిబ్బంది పాల్గొన్నారు.