దశాబ్ద కాలంగా అనేక హామీలు ఇచ్చి నిరుపేదల సంక్షేమాన్ని మరచి ఏ యొక్క పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయకుండా మోసపూరితంగా వ్యవహరిస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని రాబోయే ఎన్నికలలో పారదోలాలని కేకే మహేందర్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ఈరోజు తంగనపల్లి మండలంలోని గ్రామంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికార పార్టీ మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ లింగం రాణి గారికి మరియు తంగాళ్ళపల్లి పట్టణం మాజీ రెడ్డి సంఘం అధ్యక్షులు గంగ రాజీ రెడ్డి గారి ఆధ్వర్యంలో 30 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. నెరల్లా గ్రామ బీఎస్పీ అధ్యక్షులు ఆనంద్ గారు మరియు గ్రామ యువకులు 30 మంది చేరారు, వీరికి కేకే మహేందర్ రెడ్డి గారు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే KTR గారు ఏ ఒక్క పని గ్రామాలలో పూర్తి చేయలేదని అన్నారు. రైతులకు గతంలో లభించే ఏ ఒక్క సబ్సిడీ బీఆర్ఎస్ ప్రభుత్వం అందజేయడం లేదని రైతుబంధు పేరుతో పేద రైతులకు అన్యాయం చేసి పెద్ద రైతులకు ప్రభుత్వ ధనాన్ని దోచిపెడుతున్నారని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి తనను అసెంబ్లీకి పంపాలని ప్రజలను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు జనగం ప్రవీణ్ భూపతి సుద్దాల శ్రీనివాస్ లక్ష్మీరాజం శ్రీకాంత్ మునిగ రాజు భారత్ పరశురాములు. హారిక, సరిత, భాగ్య, శంకర్, లక్ష్మణ్ యూత్ కాంగ్రెస్ సభ్యులు పాల్గొనడం జరిగింది.
కాంగ్రెస్ పార్టీలో 100 మంది చేరిక..
120
previous post