కాంగ్రెస్, భాజపాపై సంచలన కామెంట్స్ చేసిన ఎమ్మెల్సీ కవిత..

mlc kavitha

Advertisements

&NewLine;<p>కాంగ్రెస్ అహంకారాన్ని ఓడిద్దామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు పిలుపునిచ్చారు&period; పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు ఆ పార్టీ ఇతర నాయకులు విపరీతమైన అహాన్ని ప్రదర్శిస్తున్నారని ధ్వజమెత్తారు&period; బీఆర్ఎస్ అంటే ఆత్మీయత… కాంగ్రెస్ అంటే అహంకారమని అన్నారు&period; కాంగ్రెస్ లో ఒక్క కుర్చీ కోసం నాయకులు కొట్టుకుంటారని&comma; ఇక కాంగ్రెస్ కు ప్రజల గురించి ఆలోచించే సమయం వారికి ఎక్కడ ఉంటుందని అడిగారు&period; తమ సీఎం అభ్యర్థి సీఎం కేసీఆర్… మరి కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎవరో చెప్పాలన్నారు&period; ఒక్క అవకాశం ఇవ్వాలని అడుగుతున్న బీజేపీ ఆరు సార్లు అవకాశమిస్తే నిజామాబాద్ కు ఎం చేసిందని నిలదీశారు&period; నిజామాబాద్ జిల్లా పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ అభ్యర్థి&comma; ఎమ్మెల్యే గణేష్ గుప్తాతో కలిసి కవిత గారు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు&period; ఎన్నికల ప్రచారంలో అనుసరించాల్సిన తీరు గురించి కార్యకర్తలకు సలహాలు&comma; సూచనలు ఇచ్చారు&period; గత పదేళ్ల కాలంలో తమ పార్టీ ప్రతీ ఒక్కరి సంక్షేమానికి&comma; బాగు కోసం పనిచేశామని&comma; కానీ ఎప్పుడూ అహంకారాన్ని ప్రదర్శించలేదని తెలిపారు&period; ఎప్పుడూ ఏమీ చేయని కాంగ్రెస్ పార్టీకి&comma; బీజేపీ పార్టీలు చెప్పలేనంత అహంకారాన్ని ప్రదర్శిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు&period; ఒక వేదిక వద్ద కార్యకర్తలను పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తంతున్న వీడియోను చూశానని&comma; గతంలో కొడుతున్న వీడియోను చూశామని వివరించారు&period; ఉస్మానియా విద్యార్థులను అడ్డమీది కూలీలని కూడా రేవంత్ రెడ్డి దూషించారని&comma; రైతులకు మూడు గంటల కరెంటు చాలని అన్నారని&comma; ఇలా విపరీతమైన అహంకారాన్ని ప్రదర్శిస్తున్నారని అన్నారు&period; బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేనప్పుడు కూడా ఆత్మీయంగానే ఉన్నామని&comma; ఇప్పుడూ అలానే ఉంటున్నామని చెప్పారు&period; బీఆర్ఎస్ అంటే ఆత్మీయత అని&comma; కాంగ్రెస్ అంటే అహంకారమని అన్నారు&period; బీఆర్ఎస్ మన ఇంటి పార్టీ అని&comma; కాంగ్రెస్ పార్టీ మన మంచికోరే పార్టీ కాదని తెలిపారు&period; తెలంగాణ ఇవ్వడానికి 60 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ అరిగోస పెట్టిందని&comma; సీఎం కేసీఆర్ దీక్ష చేస్తే ఇచ్చినట్టే ఇచ్చి మళ్లీ వెనక్కి తీసుకుందని&comma; చివరికి వందలాది మంది తెలంగాణ బిడ్డలను పొట్టనపెట్టుకున్న తర్వాత తెలంగాణ ఇచ్చిందని వివరించారు&period; &OpenCurlyDoubleQuote;కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏక్ అనార్ హై సౌ బిమార్ హై” అన్నట్లుగా ఉంటుందని ఎద్దేవా చేశారు&period; కాంగ్రెస్ లో ఒక్క కుర్చీ కోసం అనేక మంది కొట్టుకుంటారని&comma; కానీ తాము మాత్రం తమ సీఎం అభ్యర్థి సీఎం కేసీఆర్ అని గర్వంగా చెబుతామని స్పష్టం చేశారు&period; కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎవరని ప్రశ్నించారు&period; కుర్చీ కోసం కొట్లాటకే కాంగ్రెస్ నాయకుల సమయం సరిపోదని&comma; ఇక ప్రజల గురించి ఆలోచించే పరిస్థితి ఆ పార్టీ నాయకులకు లేదని అన్నారు&period; బీఆర్ఎస్ బలమైన పార్టీ అని&comma; కాబట్టి తప్పకుండా మూడో సారీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు&period; ఒక్కసారి అవకాశం ఇవ్వాలని బీజేపీ చెబుతోందని&comma; కానీ ఆరు సార్లు అవకాశం ఇస్తే అవకాశం ఇచ్చినా చేయని పనులు కొత్తగా ఏమి చేస్తారని ప్రశ్నించారు&period; కాంగ్రెస్ పార్టీకి 54 ఏళ్లు అవకాశం ఇచ్చినా ఏమీ చేయలేదని విమర్శించారు&period; గుణమున్న గణేష్ కావాలా లేదా ధనమున్న ధన్ పాల్ కావాలా అన్నది నిజామాబాద్ తేల్చుకోవాలని&comma; గుణమున్న గణేష్ గుప్తాను ప్రజలు గెలిపించుకుంటారన్న సంపూర్ణ విశ్వాసముందని స్పష్టం చేశారు&period; బీఆర్ఎస్ పార్టీ డీఎన్ఏలోనే గుణముందని తెలిపారు&period; ప్రజల కోసం మంచి చేసే వ్యక్తి గణేష్ అని చెప్పారు&period; నిజామాబాద్ అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపించారని&comma; అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం సీఎం కేసీఆర్ ను ఒప్పించి రూ&period; 45 కోట్లు తెచ్చారని చెప్పారు&period; బీఆర్ఎస్ పార్టీ అంటే పుష్పక విమానమని&comma; ఎంత మంది వచ్చినా స్వాగతించామని&comma; ఇంకా రావాలన్న కూడా స్థలముందని&comma; అంత పెద్ద పార్టీ తమదని స్పష్టం చేశారు&period; డివిజన్ వారీగా సమన్వయం చేసుకోవాలని&comma; తద్వారా ప్రతీ గల్లీలో తమకు ఎదురు ఉండదని స్పష్టం చేశారు&period; కనీసం 55 వేల మెజారిటీతో గణేష్ గుప్తాను గెలిపించడానికి కృషి చేయాలని కార్యకర్తలకు మార్గనిర్దేశం చేశారు<&sol;p>&NewLine;

Advertisements

Related posts

గన్నవరం హైవేపై ‘సేల్స్ టాక్స్’ హల్‌చల్..

విశాఖ అక్కయ్యపాలెం హత్యకేసులో పురోగతి ..

Lucknow Super Giants ఘన విజయం.. మార్ష్ విధ్వంసంతో సీఎస్‌కే చిత్తు..