114
నాగాయలంక మండల శ్రీకృష్ణదేవరాయ కాపు సంక్షేమ సమితి నూతన కమిటీ ఎంపిక ఆత్మీయ సమావేశం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రేమాల వారి పాలెం శ్రీ ఆంజనేయ స్వామివారికి దర్శించుకుని పూజలు నిర్వహించి అనంతరం వంతెన వద్ద నుంచి నాగాయలంక ప్రధాన రహదారుల వెంట భారీ ర్యాలీతో శ్రీ ప్రసన్న గణపతి స్వామిని దర్శించుకుని మరిపాలెం వంతెన సెంట్రల్ వరకు కాపు సోదరుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించి రంగా విగ్రహానికి పూలదండలు వేసి నివాళులర్పించారు. వెంకటేశ్వరరావు రైస్ మిల్లు వద్ద సహపంక్తి భోజనాలు నిర్వహించారు.