147
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం లోని గుడిపల్లి మండలం యామగానిపల్లి పంచాయతీలో దారుణం… వామనమూర్తి (42) అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు రాయితో తలపై కొట్టి దారుణంగా చంపేశారు. యామగానిపల్లి సమీపంలోని పెద్దవంక సమీపంలో ఘటన చోటుచేసుకుంది. క్వారీలో టిప్పర్ లోడింగ్ విషయంలో తలెత్తిన తగాదా అని సమాచారం. గుడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.