కేరళంలో మరో ప్రాణాంతక వ్యాధి వ్యాప్తి కలకలం రేపుతోంది.

Advertisements

<p>కేరళంలో మరో ప్రాణాంతక వ్యాధి వ్యాప్తి కలకలం రేపుతోంది&period; కోజికోడ్ జిల్లాలో షిగెల్లా వ్యాధి వ్యాప్తి చెందుతుండటంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు&period; ఎరంజికల్ ప్రాంతంలో తాజాగా 12 మందికి ఈ వ్యాధి సోకినట్లు వైద్యులు నిర్ధారించారు&period; అలాగే కొద్దిరోజుల క్రితం ఈ వ్యాధి బారిన పడిన నలుగురిలో ఒక చిన్నారి మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది&period; ఎరంజికల్ ప్రాంతంలో వ్యక్తి నుండి వ్యక్తికి ఈ షిగెల్లా వ్యాధి వేగంగా వ్యాపిస్తోందని అధికారులు భావిస్తున్నారు&period; దీనిని అరికట్టేందుకు ఆరోగ్య బృందాలు రంగంలోకి దిగి&comma; అనుమానిత లక్షణాలు ఉన్నవారిని గుర్తించేందుకు ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నాయి&period;<&sol;p>&NewLine;<p>షిగెల్లా అనేది ఒక రకమైన బాక్టీరియా వల్ల కలిగే అంటువ్యాధి&period; దీనినే షిగెల్లోసిస్ అని కూడా పిలుస్తారు&period; షిగెల్లోసిస్ ఒక తీవ్రమైన ప్రేగు సంబంధిత అంటువ్యాధి&period; విరోచనాలు&comma; కడుపు నొప్పి&comma; జ్వరం దీని లక్షణాలు&period; కలుషితమైన ఆహారం&comma; నీటిని తీసుకోవడం ద్వారా ఇది శరీరంలోకి చేరుతుంది&period; అలాగే ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తిని తాకడం&comma; వారు ఉపయోగించిన వస్తువులను వాడటం ద్వారా కూడా ఇది ఇతరులకు వ్యాపిస్తుంది&period; ఈ వ్యాధి ఏ వయసు వారికైనా సోకవచ్చు&comma; కానీ 5 ఏళ్లలోపు పిల్లల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది&period; రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో ఇది ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది&period; షిగెల్లా వ్యాప్తిని అరికట్టడానికి పరిశుభ్రత ఒక్కటే మార్గం&period; ఆహారం తీసుకునే ముందు చేతులను క్లీన్‌ చేసుకోవాలి&period; అలాగే&comma; నీటిని బాగా మరిగించి చల్లార్చుకుని తాగడం&comma; కలుషితమైన ఆహారాన్ని తీసుకోకపోవడం వంటి జాగ్రత్తలు పాటించాలని సూచిస్తోంది ఆరోగ్య శాఖ&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అమరావతిలో తొలిసారిగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.

ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ.

టీవీ ఛానెళ్లలో యాడ్స్ పరిమితి రద్దు చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం.