154
సూరారం పి.యస్ పరిధిలో అగ్ని ప్రమాదం జరిగింది.. ఉదయం సూరారం మైన్ రోడ్డు లో రిజిష్టర్ ఆఫీస్ సమీపంలో ఉన్న అరుంధతి ట్రేడర్స్ సెల్లార్ గోదాంలో నుండి దట్టమైన పొగలతో అగ్ని ప్రమాదం సంభవించింది. హార్డ్ వేర్, ఎలెక్ట్రికల్ , పివిసి పైపులు నిలువ ఉంచిన సెల్లార్ లో షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. షాపు యజమాని సమాచారం తో అగ్నిమాపక సిబ్బంది పైర్ ఇంజన్ తో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదం లో ఎలాంటి ప్రాణ నష్టం లేదు. ఆస్తి నష్టం 5 లక్షల రూపాయల వరకు ఉండవచ్చని సమాచారం.