142
విశాఖ నగరంలో గోయాబ్ యాజమాన్యం అక్రమ కట్టడం..స్థానిక ప్రజలకు చుక్కలు చూపిస్తోంది. ఆశీలుమెట్లలో అక్రమంగా గోయాజ్ సిల్వర్ జ్యూయలరీ పేరుతో షోరూం నిర్మించింది గోయాజ్ యాజమాన్యం..అయితే ఫుట్ పాత్ ను సైతం ఆక్రమించేస్తూ నిర్మాణం చేపట్టడంతో..విశాఖ జీవీఎంసీ కార్యాలయం ముందు
భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఈ నిర్మాణానికి అడ్డగోలుగా అనుమతులు ఇచ్చిన జీవీఎంసీ చీఫ్, సిటీ ప్లానర్ సురేష్ పై స్థానికులు మండిపడ్తున్నారు. అటు ఇంత జరుగుతున్న చోద్యం చూస్తున్న జీవీఎంసీ కమిషనర్ సాయి కాంత్ వర్మపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.