జీవన్ రెడ్డితో చర్చలు జరిపిన శ్రీధర్ బాబు, లక్ష్మణ్

Advertisements

<p>మాజీ మంత్రి&comma; కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి పార్టీ మారుతున్నారనే ప్రచారంతో అప్రమత్తమైన అధిష్టానం బుజ్జగింపు చర్యలు ప్రారంభించింది&period; రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆదేశాల మేరకు ఇద్దరు మంత్రులు ఇవాళ జగిత్యాలలోని జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లారు&period; మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు&comma; ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్&comma; చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం నేరుగా జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయనతో సుదీర్ఘంగా సమావేశమయ్యారు&period; గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న జీవన్ రెడ్డిని ప్రసన్నం చేసుకునేందుకు వారు గంటకు పైగా చర్చలు జరిపారు&period;<br &sol;>&NewLine;దశాబ్దాలుగా పార్టీకి అండగా ఉన్న జీవన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీని వీడకూడదని మంత్రులు జీవన్ రెడ్డికి సూచించారు&period; సీనియర్ నేతగా మీ సేవలు పార్టీకి ఎంతో అవసరమని వారు స్పష్టం చేశారు&period; స్థానికంగా ఉన్న రాజకీయ ఇబ్బందులు&comma; ఇతర అసంతృప్తులపై మంత్రులు ఆయనతో చర్చించారు&period; ఏవైనా సమస్యలు ఉంటే నేరుగా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించి పార్టీలో తగిన ప్రాధాన్యత కల్పిస్తామని గట్టి హామీ ఇచ్చారు&period; అయితే&comma; ఈ సమావేశం ముగిసిన ఈ క్రమంలోనే జీవన్ రెడ్డి తాను పార్టీ మారే నిర్ణయాన్ని మార్చుకుంటారా&period;&period; లేదా అనేది సస్పెన్స్‌లా మారింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వరుస చైన్ స్నాచింగ్ కేసులను ఛేదించిన భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు.

రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన మహేష్‌ కుమార్ గౌడ్.

ఈ నెల 25న రాయదుర్గంలో నారా లోకేష్ పర్యటన.