ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అక్రమ కేసులతో వ్యవసాయ రంగం, పాడి పరిశ్రమ పూర్తిగా దెబ్బతిన్నాయి అని ఆరోపించారు టిడిపి తెలుగు యువత రాష్ట్ర నేత రవినాయుడు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రత్యక్షంగా టిడిపి సానుభూతి పరులైన 600 మందిపై కేసులు పెట్టారని పరోక్షంగా 2000 మందికి పైగా పరారీలో ఉన్నారు అని వైకాపా అక్రమ కేసులతో వ్యవసాయాన్ని నమ్ముకున్న అమాయకులు ఉపాధి కోల్పోయారు అని ఆరోపించారు. వ్యవసాయ రంగం, పాడిపరిశ్రమ, హార్టికల్చర్ జీవనాధారంగా బ్రతికే అమాయకుల పై అక్రమ కేసులతో వీరంతా పరారీలో ఉన్నారు అన్నారు. టిడిపి నేతలు, టిడిపి సానుభూతి పరులను అక్రమ కేసులు పెట్టడం కన్నా అందరిని ఒకేసారి చంపేయండి అంటూ ఆవేదన వ్యక్తం చేసారు. ఎస్సీ వర్గాలపైనే అట్రాసిటీ కేసులు పెట్టించడం మంత్రి పెద్దిరెడ్డి ఇలాఖాలోనే చూస్తున్నాం అన్నారు. మంత్రి పెద్దిరెడ్డి మొద్దు నిద్రలో ఉన్నారని, ఉమ్మడి చిత్తూరు జిల్లా వాసులను మంత్రి పెద్దిరెడ్డి బెదిరింపులకు గురిచేస్తూ ఉన్మాద ఆనందం పొందుతున్నారని ఆరోపించారు. రాబోవు రోజులలో ప్రజలు వైసీపీ ప్రభుత్వానికి గట్టి బుద్ధి చెబుతారు అన్నారు టిడిపి తెలుగు యువత రాష్ట్ర నేత రవినాయుడు.
టిడిపి నేత రవినాయుడు సంచలన వ్యాఖ్యలు..
122
previous post