చంద్రగిరి మండలం, భీమవరం టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు మునిరత్నం నాయుడు పై వైసీపీ నేతలు బండరాళ్లతో దాడి చేశారు. గ్రామంలో జరిగిన ఓ కుటుంబ గొడవల కారణంగా మధ్యవర్తిగా పోలీస్ స్టేషన్ కు మునిరత్నం నాయుడు వెళ్లారు. మద్దిస్తం తెగకపోవడంతో వెనుదిరిగిన మునిరత్నం నాయుడు దింపుడు కళ్లెం దగ్గర వైసీపీ మండలం పార్టీ అధ్యక్షుడు కొటాల చంద్రశేఖర్ రెడ్డి, మట్టిరెడ్డి నవీన్ రెడ్డి వారి అనుచరలతో కలిసి దాడి చేశారు. మద్యం, గంజాయి మత్తులో బండరాళ్లతో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారంటు బాధితుడు మునిరత్నం నాయుడు తెలియజేశారు. దాడి అనంతరం మునిరత్నం నాయుడు దగ్గర బంగారం కడియం, రూ.10 వేలు నగదు దోపిడి చేశారు.. స్థానికులు తీవ్రంగా గాయపడిన మునిరత్నం నాయుడును ఏరియా ఆసుపత్రికి తరలించారు.. సమాచారం తెలుసుకుని టీడీపీ ఇన్ చార్జ్ పులివర్తి నాని హాస్పిటల్ కు చేరుకున్నారు. పరిస్థితి విషమంగా ఉండడంతో రుయా ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు రుయా నుంచి మెరుగైన వైద్యం కోసం కిమ్స్ కు తరలించారు.
టీడీపీ కమిటీ అధ్యక్షుడు పై వైసీపీ నేతల దాడి..
109
previous post