డికేలు వచ్చినా, పీకేలు వచ్చినా మా ఏకే 47.. కేసీఆర్ ను ఏం చేయలేరు..

KCR

Advertisements

&NewLine;<p>అనంతరం గజ్వేల్ నుండి హెలికాప్టర్ లో కామారెడ్డి చేరుకొని నామినేషన్ వేస్తారు&period; అనంతరం అక్కడ నిర్వహించే భారీ బహిరంగ సభలో పాల్గొంటారు&period; ఎన్నికల ప్రచారం ముగింపు సభ సీఎం గారితో గజ్వేల్ లో ఈనెల 28 తారీకు నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది&period; 2014&comma; 2018 లో కూడా ముగింపు సభ గజ్వేల్ లో చేసుకున్నాం రాష్ట్రంలో అద్భుతమైన విజయం సాధించాం&period; అప్పుడు అదే ఆనవాయితీ కొనసాగించబోతున్నాము&period; కెసిఆర్ కు ఓటు వేసి రుణ తీర్చుకునేందుకు గజ్వేల్ ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు&period; ఇచ్చిన హామీలే కాదు ప్రజలు కోరని పనులను కూడా గజ్వేల్ లో సీఎం పూర్తి చేశారు&period; కరువు పీడిత ప్రాంతమైన గజ్వేల్ నేడు కాళేశ్వరం జలాలతో సస్యశ్యామలమయ్యింది&period; గతుకుల గజ్వేల్ ను బతుకుల గజ్వేల్ గా మార్చింది కేసీఆర్&period; విద్యాలయాలకు&comma; రిజర్వాయర్లకు నిలయంగా మారింది గజ్వేల్&period; దేశ విదేశ ప్రతినిధులు గజ్వేల్ కు వచ్చి ఇక్కడ అభివృద్ధిని మెచ్చుకుంటున్నారు&period; కోకాకోలా&comma; ఫుడ్ ప్రాసెసింగ్ హబ్స్ రావడం వల్ల ఎంతో మందికి ఉద్యోగ&comma; ఉపాధి అవకాశాలు&period; గజ్వేల్ చరిత్రలో రానటువంటి రికార్డు మెజారిటీ ఈసారి కేసీఆర్ గారికి రాబోతున్నది&period; లక్షలకు పైగా మెజారిటీతో గజ్వేల్ లో గెలిచి తీరుతాం&period; కొందరు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు&period; పెద్దవాళ్ల మీద పోటీ చేస్తే పెద్దవాళ్ళం అవుతామని అనుకుంటున్నారు&period; కేసీఆర్ కు సరితూగే నాయకుడు ఈ రాష్ట్రంలో మరెవరూ లేరు&period; జీవితాన్ని ఫణంగా పెట్టీ తెలంగాణ సాధించారు&period; ఇంకెవరు పోటీ వచ్చినా అది నామ మాత్రమే కెసిఆర్ మా ముఖ్యమంత్రి అని గజ్వేల్ ప్రజలు గొప్పగా చెప్పుకుంటున్నారు&period; వేరే వాళ్ళు ఉంటే ఆ గౌరవం గజ్వేల్ కు ఉంటుందా&period; పక్క జిల్లాలు&comma; నియోజకవర్గాల నుంచి కిరాయి మనుషులను తెచ్చుకొని షో చేయాల్సిన అవసరం మాకు లేదు&period; ఎక్కడినుండి నిన్న జనం వచ్చారో ప్రజలందరికీ తెలుసు&period; మా పార్టీ కుటుంబ సభ్యులే 25 వేల మంది దాకా ఉంటారు&period; నీళ్లు పట్టుకునే మంచినీళ్ల బిందెలో&comma; పండిన ప్రతి గింజలో కెసిఆర్ కనిపిస్తున్నాడని ప్రజలు చెబుతున్నారు&period; తెలంగాణ ద్రోహులంతా రాష్ట్రంలో ఏకమవుతున్నారు&period; షర్మిల కాంగ్రెస్ పార్టీకి&comma; పవన్ కళ్యాణ్ బిజెపి పార్టీకి మద్దతు పలుకుతున్నారు&period; ఆనాడు తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన శక్తులు నేడు కాంగ్రెస్&comma; బిజెపి రూపంలో తెలంగాణపై దాడి చేసేందుకు కుట్ర చేస్తున్నాయి&period; తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలి&period; ఇలాంటి వాళ్ళ చేతుల్లో పెడితే ఆగం అవుతాం&period; దయ్యాల పాలు చేసినట్లు అవుతుంది&period; రిస్క్ లేకుండా నీళ్ళు&comma; సాగు నీళ్ళు&comma; రైతు బంధు&comma; రైతు బీమా&comma; పింఛన్లు వస్తున్నాయి&period; మరి రిస్క్ తీసుకొని వేరే ప్రభుత్వానికి ఓటు వేయడం ఎందుకు పండిన పంట ఏ తంటా లేకుండా ఊరూరా కాంట పెట్టీ కొనుగోలు చేసస్తున్నారు&period; కర్ణాటక సీఎం ధన్యవాదాలు చెప్పాలి&period; కర్ణాటకలో 5 గంటల కరెంట్ మాత్రమే ఇస్తున్నట్లు ఒప్పుకున్నారు&period; రేవంత్ రెడ్డి 3 గంటల కరెంట్ చాలు అని చెప్పి ఇప్పుడు మాట మార్చాడు&period; నేను అనలేదు అని బుకాయిస్తున్నడు&period; అన్న మాట&comma; వీడియో అందరూ చూశారు&period; కుల్లం కుల్లం అన్నవు&period; గూగుల్ చేసి చూడు రేవంత్ రెడ్డి&period; 5 గంటలు కావాలి అనేవాళ్ళు కాంగ్రెస్ కు&comma; 24 గంటల కరెంట్ కావాలనుకునేవాళ్లు బిఆర్ఎస్ కు ఓటు వేస్తరు&period; పుట్టిన బిడ్డ తల్లి చేతిలో ఉంటే మేలు ఎలా జరుగుతుందో&comma; కెసిఆర్ చేతిలో తెలంగాణ ఉంటే అలా మేలు జరుగుతుంది&period; సురక్షితంగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..