117
తణుకు పట్టణ పరిధిలోని జాతీయ రహదారిపై రహదారి నిర్వహణ పనులు చేస్తున్న వాహనాన్ని టిప్పర్ లారీ ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై మంగళవారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదంలో టిప్పర్ లారీ డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. రావులపాలెం వైపు నుంచి వస్తున్న టిప్పర్ లారీ హైవే నిర్వహణ వాహనాన్ని ఢీకొట్టడంతో వాహనం డివైడర్ పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో టిప్పర్ లారీ ముందు భాగం నుజ్జయింది. తీవ్రంగా గాయపడిన డ్రైవర్ను చికిత్స నిమిత్తం తణుకులోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.