తమిళనాడు కరూర్‌ జిల్లాలో రైలు ప్రమాదం

Advertisements

<p>తమిళనాడు కరూర్‌ జిల్లాలో రైలు ప్రమాదం జరిగింది&period; రైల్వే లెవెల్ క్రాసింగ్‌ను దాటేందుకు ప్రయత్నించిన కాలేజీ బస్సును గూడ్సు రైలు ఢీకొట్టింది&period; ఈ ఘటనలో 23 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు&period; తాంతోణి సమీపంలోని ఓ ప్రైవేట్‌ కాలేజీకి చెందిన బస్సు&period;&period;నిన్న సాయంత్రం&period;&period;కుళత్తూర్‌లోని రైల్వే లెవెల్ క్రాసింగ్‌ను దాటేందుకు ప్రయత్నించింది&period; అదే సమయంలో వేగంగా వచ్చిన గూడ్సు రైలు ఆ బస్సును ఢీకొట్టింది&period; ఈ ఘటనలో బస్సు వెనుక భాగం ధ్వంసం కావడంతో 23 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు&period; స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు&period; గాయపడిన వారిని అంబులెన్సుల్లో కరూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు&period; వారిని కరూర్ ఎంపీ జ్యోతిమణి&comma; మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ తదితరులు పరామర్శించారు&period; దిండుక్కల్ జిల్లా కరికాళిలోని రాళ్ల క్వారీ నుంచి&period;&period;పులియూర్‌లోని ప్రైవేటు సిమెంట్ కర్మాగారానికి కంకర లోడును తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది&period; ఈ ప్రమాదానికి కారణమేంటి బస్సు డ్రైవర్ నిర్లక్ష్యముందా అనే కోణంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్‌.

“15 ఏళ్ల నా కల నెరవేరింది.” ‘పంచనామా’ ప్రివ్యూలో ఉదయభాను ఎమోషనల్.

హైకూ’ టీజర్.. అందమైన కవితలాంటి ప్రేమ. కెమిస్ట్రీతో మెప్పిస్తోన్న టీజర్.