కాకినాడ జిల్లా పరిధిలోని పెద్దాపురం సబ్ డివిజన్ లో దొంగతనాలకు పాల్పడుతున్న నెరస్తుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతను వద్ద నుంచి 25 లక్షల రూపాయల విలువచేసే బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ సతీష్ బాబు అదనపు ఎస్ పి శ్రీనివాస్ ఆదివారం కాకినాడ జిల్లా ఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఏలేశ్వరం, ప్రత్తిపాడు, కిర్లంపూడి, పెద్దాపురం, సామర్లకోట తదితర ప్రాంతంలో తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ గా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న సన్యాసిరావు అనే వ్యక్తిని అదుపులో తీసుకున్నట్లు తెలిపారు. అతని వద్ద నుంచి 471 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామాన్నారు. ఇప్పటికే నిందితుడు 11 కేసుల్లో ఎనిమిది కేసులకు సంబంధించి కారాగార శిక్ష అనుభవించాడని ఎస్పీ తెలిపారు.
తాళాలు వేసిన ఇళ్లలో చోరీ..
146
previous post