తిరుపతిలో మరోసారి చిరుత కలకలం

chirutha

Advertisements

&NewLine;<p>తిరుమల నడకదారిలో లక్షిత అనే బాలికను చిరుతపులి పొట్టనబెట్టుకోవడం తెలిసిందే&period; ఈ ఘటన జరిగాక నడకదారి వెంబడి సంచరించే పలు చిరుతలను అటవీశాఖ సహకారంతో టీటీడీ బంధించింది&period; ఆ తర్వాత కొన్నాళ్ల పాటు అలిపిరి&comma; శ్రీవారి మెట్టు నడక మార్గాల్లో చిరుతల సంచారం లేదు&period; తాజాగా&comma; అలిపిరి నడకమార్గంలో శ్రీలక్ష్మీనారాయణస్వామి ఆలయం నుంచి కమ్యూనికేషన్స్ రిపీటర్ స్టేషన్ మధ్య ప్రాంతంలో చిరుత సంచరిస్తూ కనిపించింది&period; ట్రాప్ కెమెరాలో ఈ మేరకు రికార్డయింది&period; ఈ ప్రాంతంలో ఓ ఎలుగుబంటి కూడా తిరుగుతున్నట్టు కెమెరా ఫుటేజిల్లో వెల్లడైంది&period;ఈ నేపథ్యంలో&comma; టీటీడీ భక్తులను అప్రమత్తం చేసింది&period; నడకదారిలో వెళ్లే భక్తులు గుంపులుగా వెళ్లాలని స్పష్టం చేసింది&period; లక్షిత ఘటన జరిగాక&comma; ఘాట్ రోడ్లలో బైకులపై వెళ్లేవారిపై ఆంక్షలు విధించిన టీటీడీ&period; కొన్ని రోజుల కిందటే ఆ ఆంక్షలు సడలించింది&period; ఇప్పుడు మరోసారి చిరుత కలకలం రేగిన నేపథ్యంలో&comma; మరోసారి ఆంక్షలు విధిస్తారా&quest; అన్నది తెలియాల్సి ఉంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భోజ్‎శాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు

మంచిర్యాలలో పశువుల అక్రమ రవాణాపై డీసీపీ సమావేశం..

నెల్లూరు జిల్లా కావలిలో పొదుపు మంత్రం..