అమెరికాలో నమోదైన క్రిమినల్‌ కేసు నుంచి గౌతమ్‌ అదానీకి అతి త్వరలోనే విముక్తి లభించబోతున్నట్లు సమాచారం…

అమెరికాలో నమోదైన క్రిమినల్‌ కేసు నుంచి గౌతమ్‌ అదానీకి అతి త్వరలోనే విముక్తి లభించబోతున్నట్లు సమాచారం.

Advertisements

<p>అమెరికాలో నమోదైన క్రిమినల్‌ కేసు నుంచి గౌతమ్‌ అదానీకి అతి త్వరలోనే విముక్తి లభించబోతున్నట్లు సమాచారం&period; అదానీపై ఆరోపణలను అమెరికా న్యాయశాఖ ఈ వారంలోగా ఉపసంహరించుకోబోతోందని అంతర్జాతీయ పత్రికలు కథనాలు ప్రచురించాయి&period; యూఎస్‌ సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ కమిషన్‌ &lpar;యూఎస్ సెక్‌&rpar; కూడా అదానీ&comma; ఇతరులపై 2024 నవంబరులో నమోదు చేసిన మోసం కేసును కూడా సెటిల్‌ చేసుకోనుందని తెలుస్తోంది&period; అయితే&comma; అదానీ గ్రూప్‌పై సెక్‌ కొంత జరిమానా విధించే అవకాశాలు కన్పిస్తున్నాయి&period; అదానీ గ్రీన్‌ ఎనర్జీ నుంచి సౌర విద్యుత్‌ సరఫరా ఒప్పందాలు చేసుకునేందుకు ఏపీ సహా నాలుగు రాష్ట్రాలకు చెందిన ఉన్నతాధికారులకు 25 కోట్ల డాలర్ల మేరకు లంచాలు ఇచ్చారనే ఆరోపణలపై అదానీ గ్రూప్‌ చైర్మన్‌ గౌతమ్‌ అదానీ&comma; సాగర్‌ అదానీ సహా 8 మందిపై అమెరికాలో కేసు నమోదైంది&period; లంచాల సొమ్ము పోగేసేందుకు అదానీ గ్రీన్‌ ఎనర్జీ తన ప్రాజెక్టుపై తప్పుడు సమాచారమిచ్చి అమెరికా ఇన్వెస్టర్ల నుంచి నిధులు సేకరించిందని ఫారిన్‌ కరప్ట్‌ ప్రాక్టీసెస్‌ చట్టం కింద కేసులు నమోదు చేసింది&period; ఆ కేసుల నుంచి ఇప్పుడు ఊరట లభించబోతున్నట్టు తెలుస్తోంది&period; అమెరికాలో భారీ పెట్టుబడి పెట్టేందుకు అదానీ సంస్థలు ముందుకొస్తున్నాయని వారి తరఫు న్యాయవాది ప్రతిపాదించడంతో ఈ పరిణామాలు చోటుచేసుకుంటున్నట్లు అంతర్జాతీయ మీడియాలో ప్రచారం జరుగుతోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పంజాబ్ కింగ్స్‌కు వరుసగా ఐదో షాక్‌.. ప్లేఆఫ్స్ ఆశలు సంకటంలో..

తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం..

జూన్ 21న నీట్ రీ ఎగ్జామ్ నిర్వహించనున్నట్లు ఎన్‍టీఏ ప్రకటన..