తిరుపతి నగరంలోని ఎయిర్ బైపాస్ రోడ్‌లో ఉన్న డి మార్ట్ స్టోర్‌పై తక్షణ చర్యలు

Advertisements

<p>తిరుపతి నగరంలోని ఎయిర్ బైపాస్ రోడ్‌లో ఉన్న à°¡à°¿ మార్ట్ స్టోర్‌పై తక్షణ చర్యలు తీసుకోవాలని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు&comma; నేషనల్ షెడ్యూల్డ్ క్యాస్ట్ వెల్ఫేర్ కౌన్సిల్ సభ్యుడు మించల ప్రదీప్ ప్రభుత్వాన్ని కోరారు&period; ఈ మేరకు సోమవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లీగల్ మెట్రోలజీ శాఖ అసిస్టెంట్ కంట్రోలర్ ఎన్&period; స్వామికి వినతి పత్రం సమర్పించారు&period;<br &sol;>&NewLine;ఈ సందర్భంగా మంచల ప్రదీప్ మాట్లాడుతూ&comma; ఈ నెల 7à°µ తేదీన తాను కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతి ఎయిర్ బైపాస్ రోడ్‌లోని డీమార్ట్ స్టోర్‌లో నిత్యావసర సరుకులు కొనుగోలు చేశానని తెలిపారు&period; మొత్తం కొనుగోలు చేసిన సరుకుల బిల్లు దాదాపు రూ&period;9000 వరకు వచ్చిందని చెప్పారు&period; అయితే ఇంటికి వెళ్లి బిల్లును పరిశీలించగా ఒక పప్పు పదార్థం కిలో à°§à°° రూ&period;2899గా తప్పుగా నమోదు చేయబడినట్టు గుర్తించినట్లు పేర్కొన్నారు&period;<br &sol;>&NewLine;ఈ విషయంపై వెంటనే డీమార్ట్ సిబ్బందిని ప్రశ్నించగా వారు సరైన సమాధానం ఇవ్వకుండా తప్పించుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు&period; అంతేకాకుండా కన్జ్యూమర్ కోర్టులో కేసు వేస్తానని చెప్పినప్పుడు కూడా కొందరు సిబ్బంది నిర్లక్ష్యంగా స్పందిస్తూ వాగ్వాదానికి దిగారని తెలిపారు&period;<br &sol;>&NewLine;తాను ఎఫ్‌సీఐ మాజీ సభ్యుడిగా ఉన్నప్పటికీ ఇలాంటి అనుభవం ఎదురైతే సాధారణ పేద&comma; మధ్యతరగతి కుటుంబాల పరిస్థితి ఏమవుతుందో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు&period; పెద్ద షాపింగ్ మాల్స్‌లో బిల్లింగ్‌లో ఇలాంటి పొరపాట్లు జరుగడం వినియోగదారులకు తీవ్ర అన్యాయం చేస్తుందని పేర్కొన్నారు&period;అందువల్ల వినియోగదారుల హక్కులను పరిరక్షించే దిశగా సంబంధిత అధికార యంత్రాంగం వెంటనే విచారణ చేపట్టి&comma; బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు&period; అలాగే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా డీమార్ట్ యాజమాన్యం జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

తిరుపతి జిల్లా అరిగిరివారిపల్లి పాఠశాల వద్ద గ్రామస్తుల ఆందోళన.

అనంతపురం జిల్లాలో 30 ఏళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం.