తెలంగాణలో జరగనున్న జనగణన ప్రక్రియకు సంబంధించి రాష్ట్ర సెన్సెస్ డైరెక్టర్ భారతీ హోలికేరి కీలక ఆదేశాలు జారీ చేశారు..

Advertisements

<p>తెలంగాణలో జరగనున్న జనగణన ప్రక్రియకు సంబంధించి రాష్ట్ర సెన్సెస్ డైరెక్టర్ భారతీ హోలికేరి కీలక ఆదేశాలు జారీ చేశారు&period; మే 11 నుంచి జూన్ 9 వరకు జరగనున్న ఈ తొలి దశ గణనలో ప్రజల భాగస్వామ్యం చాలా ముఖ్యమని పేర్కొన్నారు&period; రాష్ట్రవ్యాప్తంగా మే 11 నుండి జూన్ 9 వరకు మొదటి దశ జనగణన కార్యక్రమం జరగనుంది&period; ఈ క్రమంలో గృహాల జాబితా తయారీ&comma; వివరాల సేకరణ కోసం అధికారులు ప్రతి ఇంటిని సందర్శిస్తారు&period; సర్వేలో 33 రకాల ప్రశ్నలుంటాయని&comma; వాటికి ఖచ్చితంగా సమాధానం చెప్పాలని ప్రజలకు సూచించారు&period; అయితే ఎవరైనా ఉద్దేశపూర్వకంగా జనగణన ఎన్యుమరేటర్లకు వివరాలు చెప్పడానికి నిరాకరించినా లేదా తప్పుడు సమాచారం ఇచ్చినా&comma; వారిపై రూ&period; 1000 జరిమానా విధిస్తామని భారతీ హోలికేరి స్పష్టం చేశారు&period; జనగణన చట్టం ప్రకారం ప్రభుత్వ అధికారులకు సరైన వివరాలు అందించడం ప్రతి పౌరుడి బాధ్యత అని ఆమె గుర్తు చేశారు&period;<&sol;p>&NewLine;<p>ఈ మొదటి దశలో ప్రధానంగా ఇళ్ల గణన&comma; మౌలిక సదుపాయాల గురించి వివరాలు సేకరిస్తారు&period; ప్రజలు ఎటువంటి భయాందోళనలు చెందకుండా అధికారులకు సహకరించాలని&comma; ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు మరియు భవిష్యత్తు ప్రణాళికల రూపకల్పనకు ఈ స మాచారం ఎంతో కీలకమని అధికారులు చెబుతున్నారు&period; ఒకవేళ ఎవరైనా నిబంధనలను అతిక్రమిస్తే&comma; జరిమానాతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది&period; కాబట్టి మే 11 నుండి ప్రారంభమయ్యే ఈ ప్రక్రియలో గణన సిబ్బందికి పూర్తి వివరాలు అందించి సహకరించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది&period; కాగా రెండవ దశ జనగణన 2027 ఫిబ్రవరి 9 నుంచి 28 వరకు జరగనుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.