తెలంగాణ ఫైనాన్స్ సెక్రటరీపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

Advertisements

<p>తెలంగాణ ఫైనాన్స్ సెక్రటరీపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది&period; పెండింగ్‌లో ఉన్న బకాయిలను త్వరితగతిన చెల్లించాలని గత ఏడాది ప్రభుత్వానికి&comma; ఫైనాన్స్ సెక్రటరీకి హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది&period; అయినా కూడా బకాయిలు చెల్లించకపోవడంతో కోర్టు ధిక్కరణ కింద రిటైర్డ్ ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు&period; సోమవారం వ్యక్తిగతంగా విచారణకు హాజరై వివరణ ఇవ్వాలని ఫైనాన్స్ సెక్రటరీకి గతంలో హైకోర్టు ఆదేశించింది&period; కోర్టుకు వ్యక్తిగతంగా ఫైనాన్స్ సెక్రటరీ హాజరు కాకపోవడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది&period; ఎట్టి పరిస్థితుల్లోనూ విచారణకు హాజరు కావాల్సిందేనని సెక్రటరీని హైకోర్ట్ ఆదేశించింది&period; అసెంబ్లీ సమావేశాలు ఉన్నందున ఆయన హాజరు కాలేకపోయారని ప్రభుత్వం తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు&period; హైకోర్టు స్పందిస్తూ&period;&period; &OpenCurlyQuote; అర్ధరాత్రి వరకు కోర్టు హాలులోనే ఉంటాము&period; వ్యక్తిగత హాజరుకు ఎట్టి పరిస్థితుల్లో మినహాయింపు ఇచ్చే ప్రసక్తి లేదు&period; ఏడాది క్రితమే బకాయిలు చెల్లించాలని ఆదేశాలు ఇచ్చాము’&period;&period;&OpenCurlyQuote;కోర్టు ధిక్కరణ కింద నోటిసులు ఇచ్చి ఆరు నెలలు అయింది&period; ఈ కాలంలోనే పదుల సంఖ్యలో విశ్రాంత ఉద్యోగులు మరణించినట్లు వార్తలు వచ్చాయి&period; అసెంబ్లీ సమావేశాలు ఉన్నట్లు ఆర్థిక శాఖ కార్యదర్శికి ముందే తెలుసు కదా &quest;&period; ముందే న్యాయస్థానం అనుమతి తీసుకోవాల్సి ఉండేది&period; కోర్టు ధిక్కరణ అంశాలను ఉపేక్షించేది లేదు’ అని స్పష్టం చేసింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వరుస చైన్ స్నాచింగ్ కేసులను ఛేదించిన భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు.

రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన మహేష్‌ కుమార్ గౌడ్.

ఈ నెల 25న రాయదుర్గంలో నారా లోకేష్ పర్యటన.