తెలంగాణ రైతులకు ప్రభుత్వం శుభవార్త.

Advertisements

<p>తెలంగాణ రాష్ట్రంలోని రైతన్నలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది&period; రైతు భరోసా పథకానికి సంబంధించిన అప్లికేషన్లను ఇంకా తీసుకుంటున్నారు&period; రైతు భరోసా పథకం డబ్బులు పొందాలంటే మార్చి 25వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసింది&period; అంటే మరో మూడు రోజుల పాటు ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చన్నమాట&period; ఫిబ్రవరి 28వ వరకు కొత్తగా పట్టాదారు పాసుపుస్తకం పొందిన రైతులు&comma; ఇప్పటి వరకు కూడా రైతు భరోసా ఉందని వాళ్ళు కొత్తగా ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సూచనలు చేసింది&period;<&sol;p>&NewLine;<p>బ్యాంకు వివరాలు నమోదు చేయని వారు కూడా అప్లై చేసుకోవచ్చని వెసులుబాటు కల్పించింది&period; అప్లికేషన్ ఫామ్ తో పాటు పాస్ పుస్తకం&comma; బ్యాంకు పాస్ బుక్ జిరాక్స్&comma; మొబైల్ నెంబర్ వివరాలు ఈ పథకానికి అప్లై చేసేటప్పుడు జత పరచాలి&period; దీనిపై పూర్తి వివరాల కోసం మండల అగ్రికల్చర్ అధికారిని సంప్రదించాలని ప్రభుత్వం సూచించింది&period; ఇది ఇలా ఉండగా తాజాగా 70 లక్షల మంది రైతుల ఖాతాలలో రూ&period; 3600 కోట్లు రైతు భరోసా నిధులను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు&period; మిగిలిన రూ&period; 5400 కోట్లకు సంబంధించి మరో 20 రోజుల్లో రూ&period; 2700 కోట్లు విడుదలవుతాయని తెలిపారు&period; ఆపై మరో 20 రోజుల్లో మిగతా రూ&period; 2700 కోట్లు జమ చేస్తామని ప్రకటన చేశారు సీఎం రేవంత్ రెడ్డి&period; నిన్న ఈ నిధులను విడుదల చేయగా&comma; ఇవాళ రైతుల ఖాతాలలో డబ్బులు జమ కానున్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్: జీడిమెట్ల పరిధిలో బంగ్లాదేశీయుల అరెస్ట్.

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన.