103
రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ అండదండలతోనే అక్రమాలు జరుగుతున్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి కే. నారాయణ ఆరోపించారు. బీఆర్ఎస్ చేస్తున్నదంతా అక్రమాలు, అన్యాయాలే.ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ కి బీజేపీకి వ్యతిరేకంగా ఉండే పార్టీలతోనే మేము కలుస్తాం.బీజేపీని వ్యతిరేకించే వాళ్ళు ఈ భూమి మీద ఉండడకూడదనేది మోడీ తత్వం.బీజేపీని వ్యతిరేకించిన వారిపై సీబీఐ, ఈడీ దాడులు నిర్వహిస్తున్నారు.కేవలం పగసాధింపు చర్యలే పనిగా పెట్టుకున్న బీజేపీ,టీఆర్ఎస్ రెండు కలిసే కాంగ్రెస్ పై కుట్ర చేస్తున్నాయి. వైసీపీ, బీజేపీ, తెరాస మూడు ఒకే దారిలో దొడ్డిదారిన నడుస్తున్నాయి. లిక్కర్ స్కామ్ అంతా వైసీపీ, టీఆర్ఎస్, బీజేపీ కలిసే చేస్తుంటే పేరుకు మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీపై చెపుతున్నారని సీపీఐ నారాయణ మండిపడ్డారు.