తెలుగు రాష్ట్రాల్లో మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ వ్యవహారం దుమారం రేపుతోంది.

Advertisements

<p>తెలుగు రాష్ట్రాల్లో మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ వ్యవహారం దుమారం రేపుతోంది&period; మాజీ ఎమ్మెల్యే ఫామ్ హౌస్‌ వ్యవహారంలో వ్యాపారవేత్తలు&comma; రియల్టర్లు&comma; రాజకీయనేతలు ఇన్వాల్వ్ కావడంతో రాజకీయంగా తీవ్ర చర్చలకు దారితీసింది&period; బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి&comma; ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తో పాటు మొత్తం 11 మంది ఈ పార్టీలో పాల్గొనగా వారిలో పైలట్ రోహిత్ రెడ్డితో పాటు ఆరుగురికి డ్రగ్ పాజిటివ్ రావడంతో సంచలనంగా మారింది&period; ఈ వ్యవహారంపై స్పందించిన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రజాప్రతినిధులకు డ్రగ్స్ పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు&period; అయితే దీనిపై స్పందించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పీసీసీ చీఫ్ నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నట్లు ప్రకటించారు&period; ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ&period;&period; సమాజంలో మాదకద్రవ్యాల వాడకం పెరగడం అత్యంత దురదృష్టకరమని&comma; దీనిని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు&period; డ్రగ్స్ వాడకాన్ని బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ ఖండిస్తుందని&comma; ఈ విషయంలో రాజకీయాలకు అతీతంగా ఎవరైనా సరే కఠిన శిక్షలు అనుభవించాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు&period; తాను ఏ విధమైన పరీక్షకైనా&comma; ఏ సమయమైనా సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా కేటీఆర్ పునరుద్ఘాటించారు&period;<&sol;p>&NewLine;<p>మరోవైపు రాజకీయ ప్రయోజనాల కోసం ప్రతి చిన్న విషయంలోనూ తన పేరును డ్రగ్స్ వివాదాల్లోకి లాగడంపై కేటీఆర్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు&period; ప్రతీసారి ఆధారాలు లేకుండా తన పేరును ప్రస్తావిస్తే ఇకపై ఉపేక్షించేది లేదని&period; చట్టపరంగా కఠినంగా స్పందిస్తానని ఆయన స్పష్టం చేశారు&period; ఇప్పటికే పలుమార్లు తాను పరీక్షలకు సిద్ధమని చెప్పినప్పటికీ&comma; కావాలనే బురదజల్లే రాజకీయాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు&period; డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయానికైనా తమ మద్దతు ఉంటుందని&comma; కానీ వ్యక్తిత్వ హననానికి పాల్పడితే మాత్రం సహించబోమని కేటీఆర్ తేల్చి చెప్పారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తమిళనాడు అసెంబ్లీలో సీఎం సైగపై వివాదం.

ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం ఎగుమతులు పెంచాలి.

హైదరాబాద్‌లో IREC-2026 అంతర్జాతీయ సదస్సు.