దీపావళి పండుగలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..!

precautions of dewali

Advertisements

&NewLine;<p>దీపావళి నాడు కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకొంటే ఉల్లాసంగా… ఆనందంగా… ఆద్యాత్మిక వైభవంతో ఈ పండుగను జరుపుకొవచ్చు&period; దీపావళిరోజు కొత్తబట్టలతో&period;&period; పిండివంటలతో… స్నేహితులతో సంబరాలు జరుపుకొనే వారు తప్పక కొన్ని జాగ్రత్తలు పాటిస్తే చాలా మంచిది&period;&period; మీ ఇంట్లోని వారు ఆందోళన పడకుండా వుంటారు&period; దీపావళి చిన్నారులకు అత్యంత ఇష్టమైన పండుగ… వారికి నచ్చిన పిండివంటలు బాణాసంచా ఈ పండుగ ప్రత్యేకం&period;&period; అందుకే బాణసంచా కాల్చేటప్పుడు పెద్దలు పక్కనే ఉండటం అత్యంత శ్రేయస్కరం&period; అలాగే చిన్నారులు&comma; మహిళలు&period;&period; వృద్దాప్యంలో వున్నవారు మతాబులు&period;&period; చిచ్చుబుడ్లు&period;&period; కాకర పువ్వవత్తులు&comma; అగ్గపెట్టేలు కాల్చేటపపుడు జాగ్రత్తలు అవసరం లక్ష్మీబాంబులు&comma; ఔట్లు&comma; సీమటపాకాయలు&comma; రకరకాల బాణసంచా కాల్చేవారు యువకులు చాలా అప్రమత్తంగా వుండాలి&period; పేలని వాటికోసం మళ్లీ వెలిగించాలని ప్రయత్నించవద్దు&period; మీరు కాల్చే బాణసంచా మరీ విపరీతమైన శబ్దాలు చేస్తే మీ చుట్టుప్రక్కల చిన్నపిల్లలు జడుసుకోవచ్చు&period; అలాగే అనారోగ్యంతో ఇబ్బందిపడేవారు ఆశబ్దాలుకు భయపడటంచేత వారికి అసాధారణ వత్తిడి కలిగే పరిస్థితులు సంభవించవచ్చు&period; యువకులు రాకేట్లు&comma; స్కైప్లయర్స్ &comma; దీపావళి షట్స్ లాంటివి కాల్చేటప్పుడు ఎదురుగా వున్న ఇళ్లపై పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి&period;<br>నిప్పు రవ్వలు ఒంటిపైన&comma; దుస్తులపైన పడితే అవి త్వరగా వ్యాపించకుండా ఉండేందుకు పిల్లలతో పాటు పెద్దలు కూడా కాటన్‌ దుస్తులనే ధరించడం మంచిది<br>టపాసులు కాల్చేటప్పుడు మంటలు రేగితే అదుపు చేసేందుకు బకెట్‌లో నిండుగా నీళ్ళు పెట్టుకోండి ఒక వేళ మీ ఇంటి పక్కన ఉన్న ఏ గుడిసె పైనో నిప్పులు పడి ప్రమాదం పెద్దదయ్యే సూచనలు కనబడితే తక్షణం ఫైర్‌ à°¸ ర్వీసెస్‌కు ఫోను చేసేందుకు ఆ సంస్థ టెలిఫోన్‌ నెంబరు గుర్తుపెట్టుకోండి&period; పసిబిడ్డలు&comma; పిల్లల చెవుల్లో దూది పెట్టడం మరచిపోవద్దు&period; లేతగా ఉండే వారి కర్ణభేరి చిన్న చిన్న శబ్దాలకు సైతం ఎక్కువగా స్పందిస్తుంది… బాంబులను ఎవరు కాల్చినా ఈ విషయంలో చాలా జాగ్రత్తలు పాటించండి&period; భూ చక్రాలను కాల్చే టప్పుడు పాదరక్షలను ధరించడం మరచి పోవద్దు&period; ఆ సమయంలో నేలపై పాకే పసికందులను కిదకు దించవద్దు&period; విడి బాంబులు లేదా సీరియల్‌గా ఉండే సీమటపాసులను కొంచెం దూరంగా ఉంచి కాల్చడం మంచిది&period; వీటిని కాల్చేటప్పుడు వచ్చి పోయే వారిని గమనించండి&period; అత్యంత ముఖ్యంగా థౌజండ్‌ వాలా&comma; 10 థౌజండ్‌ వాలా సీరీస్‌ను కాల్చేటప్పుడు జన సమర్థం లేకుండా చూసుకొని&comma; పక్కవారికి చెప్పి కాల్చండి&period; అలాగే వీటిని రేకు డబ్బాల్లో కాల్చడం ద్వారా అత్యధిక శబ్ద కాలుష్యం వేలుబతుంది కాబట్టి అలాంటి ప్రయత్నాలు చేయవద్దు వాహనాలపై కవర్లు వేసి ఉంచండి&period; పండుగ సమయంలో మీ వాహనాలను వీలైనంత వరకూ ఇంటి లోపలే ఉంచేలా చర్యలు తీసుకోండి&period; పిల్లల చేతికి రాకెట్‌&comma; తారాజువ్వ తరహా వస్తువులను ఇవ్వకపోవడమే మేలు&period; పెద్దలు మాత్రం వీటిని గుడిసెలకు దూరంగా ఉండే ప్రాంతాన్ని ఎంచుకొని కాల్చడం మంచిది&period; అదే విధంగా వీటిని కొంచెం రాత్రి అయిన తరువాత&comma; జన సమ్మర్ధం తగ్గాక కాల్చుకోవటం మేలు&period; ప్రభుత్వం నిర్దేశించిన సమయంలోనే మీ దీపావళి టపాసులను కాల్చడం పూర్తి చేసుకోండి&period;<br>గొప్పలు కోసం ఎక్కువగా టపాసులను కొనుక్కొని వాయుకాలుష్యానికి చేరువ కావద్దు&period; భారీ శబ్దాలను&comma; విస్పోటనాలను కలిగించే టపాసులు కాల్చే ముందు వాటి ప్యాక్‌లపై ముద్రించి ఉండే సూచనలను పాటించడం ద్వారా మిమ్మల్ని మీరు కాపాడుకున్న వారవుతారు&period; ఇలా తగిన జాగ్రత్తలు తీసుకొని సంతోషంగా&period;&period; సరదాగా మీ బాణసంచా కాల్చండి&period; ఈ దీపావళిని సంబరాలతో జరుపుకోండి&period; రాత్రికి త్వరగా బాణసంచా కాల్చి కాళ్లు&comma;చేతులు శుభ్రపర్చుకుని లక్ష్మీదేవిని పూజించండి హాయిగా విందు ఆరగించండి&period;&period; ఆరోగ్యంగా వుండండి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణ ఆధ్యాత్మిక క్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిలో సరికొత్త అధ్యాయం మొదలుకాబోతోంది..

హనుమాన్ జయంతితో కిటకిటలాడుతున్న కొండగట్టు..

గుజరాత్‌లో సోమనాథ్ ఆలయానికి ప్రధాని మోదీ..