దీపావళి పండుగకు రెండు రోజుల ముందు మనం అత్యంత ఘనంగా జరుపుకునే పండుగ ధన త్రయోదశి. దీపావళి పండుగను సహజంగా ధన త్రయోదశి పర్వదినంతోనే ప్రారంభించే ఆచారం పూర్వం నుంచి వస్తున్నది. అసలు సంప్రదాయం ఏంటంటే దీపావళి ఐదురోజుల పండుగ. ధన త్రయోదశి నాడు ధన్వంతరి జయంతిగా భావించి ధన్వంతరిని విశేషంగా పూజిస్తారు. ధన త్రయోదశి లక్ష్మీ దేవికి ఇష్టమైన రోజని, కుబేరుడు సంపదలు పొందిన రోజని చెప్తారు. ప్రతి సంవత్సరం ఆశ్వయుజ బహుళ త్రయోదశి రోజును ధన త్రయోదశి గా జరుపుకుంటారు. ఇక ధన త్రయోదశి రోజు చాలామంది బంగారం, వెండి, వాహనాలు, వస్త్రాలు, పాత్రలు ఇలా కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారనటంలో సందేహం లేదు. చివరకు ఒక గ్రాము బంగారమైన కొనుగోలు చేయాలని మహిళలు భావిస్తారు. అయితే ధన త్రయోదశినాడు బంగారాన్ని కొనుగోలు చేయడం కంటే కొన్ని ముఖ్యమైన వస్తువులను దానం చేస్తే బంగారాన్ని కొనుగోలు చేసి దానంచేసినంత పుణ్య ఫలాలు వస్తాయని చెబుతున్నారు. ధన త్రయోదశి నాడు పాలు పెరుగు తేనె వెన్న దానం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయని పరిహార శాస్త్రం తెలుపుతుంది. అంతేకాదు ధన త్రయోదశి నాడు తెల్లని వస్త్రాలు, కాళ్లకు చెప్పులు, గొడుగు దానం చేస్తే అఖండమైన సంపదలు వస్తాయని బుతున్నారు . భార్యాభర్తల జీవితం సాఫీగా సాగాలంటే, దంపతులు అన్యోన్యంగా జీవితం సాగించాలంటే ధన త్రయోదశి నాడు ఎవరికైనా పరుపును కానీ,
మంచాన్ని కానీ దానం చేస్తే మంచిదని చెబుతున్నారు. ఇలా దానం చేస్తే ఆ దంపతులు ఎప్పటికీ విడిపోరని అంటున్నారు. సువర్ణ దానం, వస్త్ర దానం, శయ్యా దానం, వస్తు దానం, పదార్థాల దానం ఇలా ఐదు రకాల దానాలలో ఏ దానం చేసినా అఖండమైన ఐశ్వర్యం కలుగుతుందని చెబుతున్నారు. లక్ష్మీ దేవి ఈ దానాలతో సంతోషిస్తుందని, దానాలు చేసిన వారిపై ఎప్పటికీ లక్ష్మీ దేవి కటాక్షం ఉంటుందని అంటున్నారు. ధన త్రయోదశి రోజు ఉన్న దానిలో
కొద్దో గొప్పో దానం చేస్తే మంచి ఫలితం ఉంటుందని పండితులు తెలియచేన్నారు.
ధనత్రయోదశికి ఈ పనులు చేస్తే… అష్టైశ్వర్యాలు మీ సొంతం !!
128
previous post