వరల్డ్ కప్ టోర్నీలో వరుస విజయాలతో జోష్ మీదున్న మన క్రికెటర్లు దీపావళి వేడుకల్లోనూ అదే జోష్ చూపించారు. బెంగళూరులోని ఓ హోటల్ లో ఘనంగా వేడుకలు జరుపుకున్నారు. టీమిండియా సభ్యులు అందరూ కలిసి ఉత్సాహంగా ఇందులో పాల్గొన్నారు. కెప్టెన్ రోహిత్ తన భార్య, కూతురుతో కలిసి పాల్గొన్నారు. ఇక విరాట్ కోహ్లీతో పాటు ఆయన భార్య అనుష్క ఈ వేడుకల్లో సందడి చేశారు. ఆటగాళ్లంతా సంప్రదాయబద్ధంగా కుర్తీ, పైజామాలతో దీపావళి సంబరాల్లో పాల్గొన్నారు. లీగ్ దశలో చివరి మ్యాచ్ నెదర్లాండ్స్ తో భారత జట్టు తలపడనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఈ పోరుకు వేదిక కానుంది. దీంతో భారత జట్టు సభ్యులు ఇప్పటికే బెంగళూరు చేరుకున్నారు. శనివారం దీపావళి వేడుకలను హోటల్ లోనే ఘనంగా జరుపుకున్నారు. జట్టులోని ప్లేయర్లతో పాటు కోచ్ రాహుల్ ద్రావిడ్, ఇతర టీంమెంబర్లు కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Diwali
ప్రధాని నరేంద్ర మోదీ దీపావళి వేడుకలను సైనికులతో కలిసి జరుపుకున్నారు. హిమాచల్ ప్రదేశ్ లోని లెప్చా ఏరియాలో సైనికులను కలిసి మాట్లాడిన ఫొటోలను ఆయన ట్వీట్ చేశారు. చైనా బార్డర్ కు సమీపంలో ఉన్న ఈ ఏరియా అత్యంత కీలకమైన ప్రదేశానికి ప్రధాని మోదీ ఇక్కడికి చేరుకున్నారు. ఆర్మీ యూనిఫాం ధరించి సైనికులు, అధికారులతో కలిసిపోయారు. దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మోదీ దీపావళి పండుగను సైనికులతో కలిసి జరుపుకుంటున్నారు. ఏటా ఏదో ఒక బార్డర్ ఏరియాకు వెళ్లి పండుగ పూట సైనికులను కలుస్తున్నారు. సరిహద్దులను కాపాడేందుకు కుటుంబానికి దూరంగా ఉంటున్న వారితో పండుగను సెలబ్రేట్ చేసుకోవడం సంతోషంగా ఉంటుందన్నారు.
భారతదేశం ప్రథమ పౌరురాలైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి పండుగ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. దేశానికి సంతోషకరమైన, సంపన్నమైన దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. పండుగ సందర్భంగా నిరుపేదలకు సహాయం చేయాలని, వారి ఆనందాన్ని అవసరమైన వారితో పంచుకోవడం ద్వారా ఆనందం, శ్రేయస్సును వ్యాప్తి చేయాలని ఆమె పౌరులను కోరారు. వివిధ మతాలు, విశ్వాసాల ప్రజలు ఈ పండుగను జరుపుకుంటారు. ప్రేమ, సోదరభావం, సామరస్య సందేశాన్ని వ్యాప్తి చేస్తారు. ఈ పండుగ దయ, సానుకూలత, శ్రేయస్సుకు చిహ్నం. దీపావళి పండుగ మన మనస్సాక్షిని ప్రకాశవంతం చేస్తుంది. అలాగే మానవాళి సంక్షేమం కోసం పనిచేయడానికి మనల్ని ప్రేరేపిస్తుంది. ఒక దీపం అనేక దీపాలను వెలిగించగలదు. అదే పద్ధతిలో, పేదలు, పేదవారితో మన ఆనందాలను పంచుకోవడం ద్వారా వారి జీవితాల్లో ఆనందం, శ్రేయస్సును తీసుకురాగలము, ” అని రాష్ట్రపతి ముర్ము చెప్పారు.
Read Also..
Read Also..
స్టాక్ మార్కెట్లకు దీపావళి పండుగ చాలా ప్రత్యేకం. పండగ రోజు మార్కెట్లకు సెలవు ఉన్నప్పటికీ గంటసేపు ట్రేడింగ్ జరుపుతారు. దానినే ముహూరత్ ట్రేడింగ్ అంటారు. ఆ రోజు ఇన్వెస్టర్లు స్పెషల్ గా భావిస్తారు. పండగ రోజున పెట్టుబడి పెడితే కచ్చితంగా మంచి లాభాలు వస్తాయని నమ్ముతారు. 2023 ముహూరత్ ట్రేడింగ్ టైమింగ్స్ వెల్లడించింది BSE. ముహూరత్ ట్రేడింగ్ అనేది దీపావళి రోజున జరిగే ఒక గంట ట్రేడింగ్ సెషన్. స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి దీన్ని మంచి సమయంగా పరిగణిస్తారు. ఏదైనా కొత్తగా ప్రారంభించేందుకు దీపావళి అనువైన సమయంగా భావిస్తున్నట్లు మార్కెట్ విశ్లేషకులు తెలిపారు. ఏడాది పొడవునా ఈ సెషన్లో ట్రేడింగ్ చేయడం వల్ల పెట్టుబడిదారులు ప్రయోజనం పొందుతారని నమ్ముతారు. ముహురత్ సమయంలో వ్యాపారం చేయడం వల్ల శ్రేయస్సు, ఆర్థిక వృద్ధి లభిస్తుందని భావిస్తారు. గత పది ముహూర్తపు ట్రేడింగ్ సెషన్లలో, ఏడుసార్లు స్టాక్ మార్కెట్ లు సానుకూల రాబడితో ముగిశాయని మాస్టర్‌ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ హర్జీత్ సింగ్ అరోరా అన్నారు. దీర్ఘకాలిక పెట్టుబడి కోణం నుండి ఈక్విటీలో పెట్టుబడి పెట్టాలని.. ఈక్విటీ మార్కెట్ అసాధారణమైన రాబడిని అందిస్తుందని వివరించారు.
ఏలూరు జిల్లా నూజివీడులో దీపావళి ముసుగులో ప్రజల సొమ్మును స్వాహా చేయడానికి కొందరు సిండికేట్ గా ఏర్పడి రంగం సిద్ధం చేసుకున్నారు. దీపావళి మందు బాణాసంచా అమ్మే షాపుల వేలంపాట నిర్వహించడం పై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. నూజివీడు పట్టణంలో లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రాంగణంలో దీపావళి కి బాణాసంచా అమ్ముకునేందుకు ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ ప్రాణం లో చుట్టూ ప్రహరీ గోడ ఉండటం దగ్గర్లో పెట్రోల్ బంక్ జనావాసాలు ఉన్నాగాని ప్రభుత్వం ఇక్కడే దీపావళి టపాకాయల సామాను అమ్ముకునేందుకు అనుమతులు మంజూరు చేసింది. ఇక్కడ షాప్ పెట్టుకునేందుకు ఈరోజు వేలంపాట నిర్వహించారు ఒక్కొక్క షాపు నుండి 10000 నుండి 35 వేల వరకు వేలంపాటలో షాపులు పెట్టుకునేందుకు షాప్ యజమానులు వేలంపాటలో దక్కించుకున్నారు. కొంతమంది సిండికేట్ అయి షాపు యజమానుల దగ్గర నుండి వేలంపాట నిర్వహించి మూడు నుంచి నాలుగు లక్షల వరకు వసూలు చేశారు. షాపుల నిర్వహణకు అధికారుల నుండి పర్మిషన్లు తెచ్చేందుకు లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రాంగణానికి అద్దెకు ఈ డబ్బును వినియోగించడం జరుగుతుందని సిండికేట్ మెంబర్లు తెలియజేస్తున్నారు. వేలంపాట నిర్వహణతో షాపులు దక్కించుకున్న యజమానులు ప్రజలు పై అధిక రేట్లు పెట్టి వసూలు చేసేందుకు రంగం సిద్ధం వాతావరణ మాలిపోలించక ప్రజలు ఎవరు కొనకపోతే ఎక్కువగా నష్టపోయేది షాపు యజమానులుగా మేమేంటో వారు ఇదిలా ఉండగా ఏదైనా ప్రమాదం తీవ్రమైన నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని స్థానికులు తెలియజేస్తున్నారు. గతంలో ఇదే షాపులకు లాటరీ ద్వారా నిర్వహించగా నేడు కొంతమంది సిండికేట్ గా ఏర్పడి వాలంపాట ఏర్పాటు చేశారు. లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రాంగణంలో కాకుండా స్థానిక మార్కెట్ యార్డులో దీపావళి సామాన్విక్రయించే షాపులు ఏర్పాటు చేస్తే అటు ప్రభుత్వానికి ఆదాయం లభిస్తుందని ఎవరికి అద్దె చెల్లించాల్సిన అవసరం గానీ వేలంపాట నిర్వహించి డబ్బులు వసూలు చేసే అవసరంగానే ఉండదని తెలియజేస్తున్నారు.
దీపావళి పండుగకు రెండు రోజుల ముందు మనం అత్యంత ఘనంగా జరుపుకునే పండుగ ధన త్రయోదశి. దీపావళి పండుగను సహజంగా ధన త్రయోదశి పర్వదినంతోనే ప్రారంభించే ఆచారం పూర్వం నుంచి వస్తున్నది. అసలు సంప్రదాయం ఏంటంటే దీపావళి ఐదురోజుల పండుగ. ధన త్రయోదశి నాడు ధన్వంతరి జయంతిగా భావించి ధన్వంతరిని విశేషంగా పూజిస్తారు. ధన త్రయోదశి లక్ష్మీ దేవికి ఇష్టమైన రోజని, కుబేరుడు సంపదలు పొందిన రోజని చెప్తారు. ప్రతి సంవత్సరం ఆశ్వయుజ బహుళ త్రయోదశి రోజును ధన త్రయోదశి గా జరుపుకుంటారు. ఇక ధన త్రయోదశి రోజు చాలామంది బంగారం, వెండి, వాహనాలు, వస్త్రాలు, పాత్రలు ఇలా కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారనటంలో సందేహం లేదు. చివరకు ఒక గ్రాము బంగారమైన కొనుగోలు చేయాలని మహిళలు భావిస్తారు. అయితే ధన త్రయోదశినాడు బంగారాన్ని కొనుగోలు చేయడం కంటే కొన్ని ముఖ్యమైన వస్తువులను దానం చేస్తే బంగారాన్ని కొనుగోలు చేసి దానంచేసినంత పుణ్య ఫలాలు వస్తాయని చెబుతున్నారు. ధన త్రయోదశి నాడు పాలు పెరుగు తేనె వెన్న దానం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయని పరిహార శాస్త్రం తెలుపుతుంది. అంతేకాదు ధన త్రయోదశి నాడు తెల్లని వస్త్రాలు, కాళ్లకు చెప్పులు, గొడుగు దానం చేస్తే అఖండమైన సంపదలు వస్తాయని బుతున్నారు . భార్యాభర్తల జీవితం సాఫీగా సాగాలంటే, దంపతులు అన్యోన్యంగా జీవితం సాగించాలంటే ధన త్రయోదశి నాడు ఎవరికైనా పరుపును కానీ,
మంచాన్ని కానీ దానం చేస్తే మంచిదని చెబుతున్నారు. ఇలా దానం చేస్తే ఆ దంపతులు ఎప్పటికీ విడిపోరని అంటున్నారు. సువర్ణ దానం, వస్త్ర దానం, శయ్యా దానం, వస్తు దానం, పదార్థాల దానం ఇలా ఐదు రకాల దానాలలో ఏ దానం చేసినా అఖండమైన ఐశ్వర్యం కలుగుతుందని చెబుతున్నారు. లక్ష్మీ దేవి ఈ దానాలతో సంతోషిస్తుందని, దానాలు చేసిన వారిపై ఎప్పటికీ లక్ష్మీ దేవి కటాక్షం ఉంటుందని అంటున్నారు. ధన త్రయోదశి రోజు ఉన్న దానిలో
కొద్దో గొప్పో దానం చేస్తే మంచి ఫలితం ఉంటుందని పండితులు తెలియచేన్నారు.





Total views : 147066