తాడేపల్లిగూడెం పట్టణం ఆర్టీసీ డిపో సెంటర్ సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా జీవీ (గుర్రం వెంకటేశ్వర్లు టెక్స్టైల్స్ ) మాల్ బ్రాంచ్ ఏర్పాటు పశ్చిమలో ఇది రెండవది కాగా, రాష్ట్రంలోనే 12 వ బ్రాంచ్ ను ఇక్కడ ఏర్పాటు చేసిన జీవీ మాల్ నిర్వాహకులు అడుగడుగునా నిబంధనలకు నీళ్ళొదిలి వినియోగదారులు ప్రాణాలతో చెలగాటమాడుతున్న మాల్ నిర్వాహకులు పట్టణంలో ఎవరైనా వ్యాపారం ప్రారంభించాలంటే ముందుగా మున్సిపాల్టీ నుంచి వ్యాపార అనుమతి తప్పనిసరి కానీ ఆ అనుమతి తీసుకోని జీవీ మాల్ యాజమాన్యం సరైన సెట్ బ్యాక్ లేకుండా 80 అడుగుల మాస్టర్ ప్లాన్ ఉన్న మున్సిపల్ రోడ్డులో నిబంధనలు తుంగలో తొక్కి యధేచ్ఛగా మాల్ నిర్మాణం చేపట్టిన జీవీ మాల్ యాజమాన్యం గతంలో ఈ మాల్ నిర్మాణ సమయంలో ఇక్కడ మున్సిపాలిటీ స్థలంలో చిరు వ్యాపారులు ఉండగా వారిని బెదిరించి ఖాళీ చేయించిన వైనం మాల్ కు ముందు 80 ఫీట్ల మున్సిపల్ రోడ్డు మాస్టర్ ప్లాన్ లో ఉండగా ఆ మున్సిపల్ రోడ్డును యదేచ్ఛగా ఆక్రమించుకున్న జీవీ మాల్ యాజమాన్యం ప్రభుత్వ మున్సిపల్ స్థలం వీరి సొంత సొత్తులాగ ఆక్రమించుకుని వీళ్ళే సిమెంట్ రోడ్డు వేసేసిన వైనం వీరు వేసిన సిమెంట్ రోడ్డును వారి ఇస్టానుసారంగా పార్కింగ్ కు వినియోగించుకుంటున్నట్లు తెలిసినా తెలియనట్లు నటిస్తున మున్సిపల్ అధికారులు ఇంత దారుణంగా నిబంధనలు బేఖాతరు చేసిన మాల్ యాజమాన్యానికి ఇవేవీ చూడకుండా అమ్యామ్యాలు మరిగి గుడ్డిగా కొన్ని అనుమతులిచ్చిన తాడేపల్లిగూడెం మున్సిపల్ అధికారులు మాల్ లో సరైన అగ్నిమాపక నిబంధనలు, నిరోధకాలు పాటించని మాల్ యాజమాన్యం నిబంధనల ప్రకారం మాల్ చూట్టూ ఫైర్ వెహికల్ తిరిగే స్థలం ఉంటేనే అనుమతులు ఇవ్వాల్సి ఉండగా అధికారులు తాయిలాలు తీసుకుని వీరికి అముమతులిచ్చినట్లుగా ఆరోపణలు అంత పెద్ద మాల్ కు ఒక్కటే ముఖద్వారం ఏర్పాటు, అలాగే ఏమర్జెన్సీ కిటికీలు గానీ, ద్వారాలు గానీ ఒక్కటి కూడా ఏర్పాటు చెయ్యని జీవీ మాల్ యాజమాన్యం ఒకవేళ మాల్ లో ఏదైనా అగ్నిప్రమాదం జరిగితే వినియోగదారులు ప్రాణాలు గాలిలో కలిసిపోయే అవకాశం మాల్ కింద తగిన పార్కింగ్ కావలసిన సెల్లార్ విశాలంగా ఉండాల్సింది పోయి ఇరుకుగా నిర్మించిన మాల్ నిర్వహకులు అంత ఇరుకు సెల్లార్ లో కేవలం సెక్యూరిటీకి ఒక్క గది మాత్రమే నిర్మించాలనే ఖచ్చితమైన నిబంధన ఉన్నా యధేచ్ఛగా ఆ ఇరుకు సెల్లార్ లో అదనపు గదులు నిర్మించిన మాల్ యాజమాన్యం ఇంత పెద్ద మాల్ ఏర్పాటులో పర్యావరణ అనుమతులు కూడా తప్పనిసరి కాగా అవేమీ పాటించని జీవీ మాల్ నిర్వాహకులు ఇక లేబర్ లైసెన్స్, ఇన్కమ్, కమర్షియల్ లైసెన్సులు వీరికి ఎంతవరకూ ఉన్నాయనేది ప్రశార్థకమే..?? యదేచ్ఛగా మున్సిపల్, ఫైర్ సేఫ్టీ, రెవిన్యూ, లేబర్, పర్యావరణ, మిగిలిన ఆయా శాఖల నిబంధనలు బేఖాతరు చేస్తూ ఆడింది ఆట పాడింది పాటగా వ్యవహరిస్తున్న జీవీ మాల్ యాజమాన్యం పై చర్యలు తీసుకుని విరి అనుమతులు రద్దుచేసి నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఈ మాల్ ను కూలగొట్టి వీరిపై సంబంధిత అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్.
నిబంధనలకు విరుద్ధంగా జీవీ మాల్..
137
previous post