నేడు ఛత్తీస్‌గడ్‌లో తొలి దశ..

Chhattisgarh

Advertisements

&NewLine;<p>ఛత్తీస్‌గడ్‌ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమయింది&period; నక్సల్స్‌ ప్రభావిత బస్తర్ జిల్లాలోని పలు ప్రాంతాలు సహా మొత్తం 20 నియోజకవర్గాలకు ఓటింగ్ జరుగుతోంది&period; ఓటింగ్ ప్రక్రియను రెండు టైమ్ స్లాట్స్‌గా విభజించారు&period; మొదటి స్లాట్ ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ జరగనుంది&period; ఇక రెండో స్లాట్‌లో ఉదయం 7 గంటలకు ఓటింగ్ మొదలై మధ్యాహ్నం 3 గంటలకు ముగియనుంది&period; నక్సల్స్ ప్రభావిత ప్రాంతం కావడంతో పకడ్బందీ భద్రతా చర్యలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది&period; తొలి దశ ఎన్నికల్లో బస్తర్&comma; రాజ్‌నంద్‌గావ్‌ జిల్లాల నుంచి 223 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు&period; రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 4&comma;078&comma;681 మంది ఓటు హక్కును ఉపయోగించుకోనున్నారు&period; ఇందులో 2&comma;084&comma;675 మంది మహిళలు&comma; 1&comma;993&comma;937 మంది పురుషులు&comma; 69 మంది ట్రాన్స్‌జెండర్ వ్యక్తులు ఓటర్లుగా ఉన్నారు&period; మొదటి దశ పోలింగ్‌లో పలువురు ముఖ్యనేతలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు&period; అధికార కాంగ్రెస్ పార్టీ ఛత్తీస్‌గఢ్ చీఫ్&comma; ఎంపీ దీపక్ బైజ్ &lpar;చిత్రకూట్&rpar;&comma; మంత్రులు కవాసీ లఖ్మా&comma; మోహన్ మార్కం &comma; మహ్మద్ అక్బర్ &comma; ఛవీంద్ర కర్మతోపాటు పలువురు ముఖ్యనేతలు ఉన్నారు&period; బీజేపీకి చెందినవారిలో మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్&comma; మాజీ మంత్రులు లతా ఉసెండి &comma; విక్రమ్ ఉసెండి &comma; కేదార్ కశ్యప్ &comma; మహేష్ గగ్డా &comma; మాజీ ఐఏఎస్ అధికారి నీలకంఠ్ టేకం ముఖ్యమైన అభ్యర్థుల జాబితాలో ఉన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.