పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చుతున్నాయి.

Advertisements

<p>పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చుతున్నాయి&period; హెజ్‌బొల్లా స్థావరాలే లక్ష్యంగా దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ సైన్యం&period;&period; తాజాగా లెబనాన్ భూభాగంలోకి మరింత లోపలికి చొచ్చుకుపోయింది&period; ఇజ్రాయెల్ బలగాలు ఇజ్రాయెల్-లెబనాన్ సరిహద్దు నుంచి సుమారు 6 కిలోమీటర్ల మేర ముందుకు వెళ్లి&comma; దక్షిణ లెబనాన్ పట్టణమైన ఖియామ్ లోకి ప్రవేశించినట్లు లెబనీస్ మీడియా వెల్లడించింది&period; ప్రస్తుతం ఖియామ్ పట్టణంలో ఇజ్రాయెల్ సైన్యం నిరంతర ఆర్టిలరీ షెల్లింగ్‌తో భీకర దాడులకు పాల్పడుతోందని&comma; శత్రు బలగాలు పట్టణంలోకి ప్రవేశించాయని స్థానిక మీడియా నివేదించింది&period; ఒకవైపు వైమానిక దాడులు చేస్తూనే&comma; దానికి సమాంతరంగా ఇజ్రాయెల్ దళాలు సరిహద్దు ప్రాంతం గుండా ఈ దాడులకు దిగినట్లు లెబనీస్ సైనిక వర్గాలు తెలిపాయి&period;<&sol;p>&NewLine;<p>ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ వీడ్కోలు కార్యక్రమం వాయిదా పడింది&period; అమెరికా-ఇజ్రాయెల్ దాడులు ఐదో రోజుకు చేరుకోవడం&comma; దాడుల తీవ్రత పెరగడంతో భద్రతా కారణాల దృష్ట్యా ఇరాన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది&period; గత వారంలో జరిగిన అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేనీ ప్రాణాలు కోల్పోయారు&period; ఖమేనీ అంత్యక్రియలు ఆయన స్వస్థలమైన మషాద్ నగరంలో నిర్వహించనున్నారు&period; అక్కడి ప్రసిద్ధ ఇమామ్ రజా మసీదు ప్రాంగణంలోనే ఖమేనీ తండ్రి సమాధి కూడా ఉంది&period; 40 రోజుల పాటు సంతాప దినాలు పాటించాలని ఇరాన్ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది&period;<&sol;p>&NewLine;<p>ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఎగుమతిదారు అయిన సౌదీ అరామ్‌కో కు చెందిన అతిపెద్ద రిఫైనరీ రాస్ తనురా పై ఇరాన్ మరోసారి డ్రోన్ దాడి చేసింది&period; ఈ విషయాన్ని సౌదీ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి కూడా ధృవీకరించారు&period; అయితే&comma; ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ దాడి వల్ల ఎలాంటి ఆస్తి నష్టం లేదా ప్రాణ నష్టం సంభవించలేదని అధికారులు వెల్లడించారు&period; ఇరాన్ తయారీ షాహెద్ సూసైడ్ డ్రోన్లతో జరిగిన దాడి కారణంగా అరామ్‌కో రిఫైనరీని తాత్కాలికంగా మూసివేశారు&period; తాజాగా జరిగిన దాడితో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది&period; ఫస్ట్ అటాక్ తర్వాత అరామ్‌కో ఇప్పటికే లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ &comma; ప్రోపేన్&comma; బ్యూటేన్ ఎగుమతులను కొన్ని వారాల పాటు నిలిపివేస్తున్నట్లుగా ప్రకటించింది&period;à°® రోవైపు హార్ముజ్ జలసంధి ద్వారా చమురు రవాణా ప్రమాదకరంగా మారడంతో&comma; సౌదీ అరేబియా తన ఎగుమతులను రెడ్ సీ మీదుగా తరలించేందుకు తీవ్రంగా ప్రయత్నాలు మొదలుపెట్టింది&period;<&sol;p>&NewLine;<p>మిడిల్ ఈస్ట్‌లో పెరుగుతున్న యుద్ధ వాతావరణం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి&period; బ్రెంట్ క్రూడ్ ఆయిల్ à°§à°° ఇవాళ 1&period;4 శాతం పెరిగి బ్యారెల్‌కు 82&period;53 డాలర్లకు చేరింది&period;&period;ఇరాన్‌తో యుద్ధం వేళ అమెరికా వద్ద ఉన్న క్షిపణి&comma; ఆయుధ నిల్వలు తగ్గుతున్నట్లు తాజాగా పలు నివేదికలు వెల్లడించాయి&period; ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఎమర్జెన్సీ మీటింగ్‌కు సిద్ధమైనట్లు తెలుస్తోంది&period; ఆయుధ ఉత్పత్తిని త్వరితగతిన పెంచే అంశంపై చర్చలు జరపడానికి రక్షణరంగ కాంట్రాక్టర్లను&comma; ఇతర ఉన్నతాధికారులను అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌కు ఆహ్వానించినట్టు అంతర్జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి&period;ఇరాన్‌తో కొనసాగుతోన్న యుద్ధంలో భారీగా క్షిపణులను వినియోగించడంతో&period;&period; తగ్గిపోతున్న ఆయుధాగారాన్ని తిరిగి నింపడానికి అమెరికా రక్షణ శాఖ పెంటగాన్‌ చర్యలు తీసుకుంటున్నట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి&period; ఇందుకు పెద్ద మొత్తంలో ఖర్చయ్యే అవకాశం ఉందని అంచనా వేశాయి&period; 2022లో రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేసినప్పటి నుంచి అగ్రరాజ్యం ఉక్రెయిన్‌కు భారీగా సైనిక సహాయం అందిస్తుండడంతో&period;&period; ఆ దేశం వద్ద ఉన్న నిల్వలు తగ్గినట్టు తెలుస్తోంది&period; మరో 10 రోజులు ఇలాగే దాడులు కొనసాగిస్తే అవి పూర్తిగా తగ్గిపోయే ప్రమాదం ఉందని పెంటగాన్‌ పేర్కొన్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి&period; ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడు ఎమర్జెన్సీ మీటింగ్‌కు సిద్ధమయ్యారు&period;<&sol;p>&NewLine;<p>&nbsp&semi;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం..

భారత్‌లో వ్యక్తిగత పర్యటనలో టిఫానీ ట్రంప్‌..

భారత మామిడిపండ్లపై జపాన్ తాత్కాలిక నిషేధం విధించడం కలకలం రేపింది.