ఇరాన్‌ అధికారికంగా హర్ముజ్‌ జలసంధిని మూసి వేసింది.

Advertisements

<p>ఇరాన్‌ అధికారికంగా హర్ముజ్‌ జలసంధిని మూసి వేసింది&period; నౌకలు దాటడానికి ప్రయత్నిస్తే తగలబెడతామని ఐఆర్‌జీసీ హెచ్చరించింది&period; ఇరాన్‌ చర్యతో హార్ముజ్‌ స్ట్రెయిట్ దగ్గర 700 లకు పైగా నౌకలు చిక్కుకుపోయాయి&period; వాటిలో 100 కంటైనర్‌ షిప్స్‌ ఉన్నాయి&period; మార్చి 1 à°µ తేదీన ఈ మార్గం నుంచి కేవలం 3 ట్యాంకర్లు మాత్రమే బయటకు వెళ్లగా&comma; మార్చి 2à°µ తేదీన ఒక చిన్న ట్యాంకర్‌&comma; కార్గోషిప్‌ మాత్రమే ప్రయాణం సాగించినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి&period;<&sol;p>&NewLine;<p>కాగా&comma; హర్మూజ్‌ జలసంధి పర్షియన్‌ గల్ఫ్‌ను అరేబియా సముద్రంతో అనుసంధానిస్తుంది&period; సౌదీ అరేబియాతో పాటు పశ్చిమాసియాలోని ఇరాన్&comma; ఇరాక్‌ తదితర దేశాల చమురు&comma; ఖతర్&comma; యూఏఈ ఉత్పత్తి చేసే సహజ వాయువు రవాణాకు హార్మూజ్‌ ఏకైక మార్గం&period; దీనిగుండా ఒక్కో నౌక వెళ్లడానికి అత్యంత ఇరుకైన మార్గాలు మాత్రమే అందుబాటులో ఉంటాయి&period; హర్మూజ్‌ జలసంధి పర్షియన్ గల్ఫ్‌ను గల్ఫ్ ఆఫ్ ఓమాన్‌తో కలుపుతున్న సుమారు 33 కిలోమీటర్ల వెడల్పున్న సన్నని సముద్ర మార్గం&period; ప్రపంచ చమురు సరఫరాలో సుమారు 20 శాతం ఈ మార్గం ద్వారానే సాగుతుంది&period; ఈ మార్గం గుండా సౌదీ అరేబియా&comma; కువైట్&comma; ఇరాక్&comma; ఖతార్&comma; బహ్రెయిన్&comma; యుఏఈ మరియు ఇరాన్ దేశాల నుంచి ముడి చమురు&comma; ఎల్‌ఎన్‌జీ సరఫరా అవుతోంది&period; వీటిలో ఎక్కువ భాగం ఆసియా మార్కెట్లకు&comma; ముఖ్యంగా చైనాకు వెళ్తుంది&period;<&sol;p>&NewLine;<p>అమెరికా ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం&comma; ఈ మార్గానికి ప్రత్యామ్నాయాలు చాలా పరిమితంగా ఉన్నాయి&period; సౌదీ అరేబియా&comma; యుఏఈ కొంత మేర పైప్‌లైన్ మార్గాలను వినియోగిస్తున్నప్పటికీ&comma; మొత్తం సరఫరాకు అవి సరిపోవు&period; 1980లలో ఇరాన్-ఇరాక్ &OpenCurlyQuote;ట్యాంకర్ యుద్ధం’ తర్వాత పూర్తిస్థాయిలో హర్మూజ్ మూసివేత జరగలేదు&period; అయితే ఇటీవల ఫిబ్రవరిలో ఇరాన్ సైనిక విన్యాసాల సమయంలో కొంతకాలం రవాణా ఆంక్షలు విధించడంతో చమురు ధరలు 6 శాతం పెరిగాయి&period; ఇరాన్‌పై ఇజ్రాయెల్&comma; అమెరికా యుద్ధం అంతర్జాతీయంగా చమురు సరఫరాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది&period; ఇరాన్&comma; ఒమన్‌ మధ్య ఉండే హర్మూజ్‌ జలసంధి ప్రపంచంలోనే అత్యంత బిజీ చమురు మార్గం&period; అంతర్జాతీయ చమురు సరఫరాలకు ఇది అత్యంత కీలకం&period; మొత్తం రోజువారీ చమురు&comma; సహజవాయు సరఫరాల్లో 20 శాతం దీనిగుండానే జరుగుతూ ఉంటుంది&period; యుద్ధం దెబ్బకు ఇప్పుడక్కడ చమురు నౌకల రాకపోకలు తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత మామిడిపండ్లపై జపాన్ తాత్కాలిక నిషేధం విధించడం కలకలం రేపింది.

కాంగోలో ఎబోలా కలవరం . రోజురోజుకు పెరుగుతున్న మృతుల సంఖ్య…

ఇరాన్‌పై భీకరంగా విరుచుకుపడ్డ అమెరికా..