ఈ నెల 8న ఉదయం 9.30 గంటలకు శాసన మండలి హల్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుందని

Advertisements

<p>అసెంబ్లీలో ప్రాంగణంలో శాసనమండలి భవనం పునర్నిర్మాణ పనులు చాలా వేగంగా నడుస్తున్నాయని చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు&period; ఈ నెల 8à°¨ ఉదయం 9&period;30 గంటలకు శాసన మండలి హల్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుందని&comma; సీఎం రేవంత్ రెడ్డి నూతన తెలంగాణ శాసన మండలిని ప్రారంభోత్సవం చేస్తారని తెలిపారు&period; హైదరాబాద్ లోని మండలి ఛాంబర్ లో ఆయన మీడియాతో చిట్ చాట్‌లో మాట్లాడారు&period; వచ్చే బడ్జెట్ సమావేశాలు అక్కడ నుంచి ప్రారంభం అవుతాయన్నారు&period; ఎమ్మెల్యేలకు&comma; ఎమ్మెల్సీలకు అందరికీ సెంట్రల్ హాల్ నిర్మాణం జరుగుతుందని&comma; దాదాపు 30 కోట్ల వ్యయంతో శాసన మండలి పనులు పూర్తి చేశారని గుత్తా సుఖేందర్ రెడ్డి చెప్పారు&period; దాదాపు 99 శాతం పనులు అయిపోయాయని&comma; ఏపీ ఎమ్మెల్యేలు&comma; ఎమ్మెల్సీలు అమరావతికి వెళ్లిన తర్వాత ఆ భవనం ఖాళీగా ఉందని&comma; దాన్ని అలాగే వదిలేస్తే బిల్డింగ్ శిథిలావస్థకు చేరుకునేలా ఉందన్నారు&period;<&sol;p>&NewLine;<p>ఆ హెరిటేజ్ బిల్డింగ్‌ను కాపాడుకొని&comma; అసెంబ్లీని సుందరంగా మార్చుకోవాలనే ఆలోచన చేశామని తెలిపారు&period; ఒకే చోట శాసనసభ&comma; శాసన మండలి ఉండాలనే గొప్ప సంకల్పంతో సీఎం రేవంత్ రెడ్డి పునర్నిర్మాణ పనులను ప్రారంభించారని&comma; పార్లమెంట్ తరహాలో తెలంగాణ శాసనసభ ఉండబోతుందని గుత్తా చెప్పారు&period; ఎమ్మెల్యేలకు&comma; ఎమ్మెల్సీలకు&comma; అధికారులకు&comma; మంత్రులకు ఎవరికి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు&period; బడ్జెట్ సెషన్స్ తర్వాత సెంట్రల్ హాల్ ఏర్పాటు చేస్తామని&comma; ఈ పనులు పూర్తి కావడానికి ఏడాదిన్నర సమయం పట్టిందని&comma; హెరిటేజ్ భవనం కావడంతో చాలా జాగ్రత్తగా పనులు చేయాల్సి వచ్చిందని ఆయన తెలిపారు&period; మరో 40 నుంచి 50 సంవత్సరాల వరకు ఈ శాసన మండలి భవనానికి ఢోకా లేదన్నారు&period;<&sol;p>&NewLine;<p>అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటు చేసే తెలంగాణ తల్లి విగ్రహం మార్చి 8 లోపు నిర్మాణం పూర్తి అయితే అదే రోజు విగ్రహ ఆవిష్కరణ చేస్తామని గుత్తా తెలిపారు&period; ఆదర్శ నగర్ లోని 9 ఎకరాల ల్యాండ్ లో కన్స్టిట్యూషన్ క్లబ్ నిర్మాణం చేపట్టబోతున్నట్లుగా ఆయన వివరించారు&period; మన రాష్ట్ర శాసన పరిషత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని&comma; మిగిలిన రాష్ట్రాలు కూడా మన తరహాలో సభ సమావేశ హాల్స్ నిర్మించుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం నిర్మాణం చేపట్టిందన్నారు&period; ప్రస్తుతం ఉన్న తెలంగాణ శాసన మండలిని&comma; జూబ్లీహాల్ ను పునరుద్ధరణ చేసి ప్రభుత్వ కార్యక్రమాలకు వాడుకునే ఆలోచనలో సర్కార్ ఉందని గుత్తా తెలిపారు&period; డ్రైనేజ్&comma; ఫ్లోరింగ్&comma; ఎలక్ట్రిసిటీ&comma; సీఎం ఛాంబర్&comma; చైర్మన్&comma; వైస్ చైర్మన్ ఛాంబర్&comma; సెక్రటరీ ఆఫీస్&comma; కౌన్సిల్ సెక్రెటరీయేట్&comma; సభ్యులకు మీడియా పాయింట్&comma; మీడియా కోసం మీడియాకు హాల్‌ను నిర్మించినట్లుగా గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు&period;<&sol;p>&NewLine;<p>ప్రస్తుత రాజకీయాల్లో ప్రశాంతంగా ఉన్నానని&comma; అవకాశం ఇస్తే శాసన మండలిలో ఉంటానని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు&period; మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం అన్న వాళ్ళు సైలెంట్ అయ్యారని&comma; ప్రజా పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు&period; వచ్చే ఎన్నికలు జమిలి ఎన్నికలని&comma; నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది&period;&period; మహిళా రిజర్వేషన్‌లు వస్తాయి&period;&period; రాజకీయంగా చాలా మార్పులు వస్తాయని గుత్తా తెలిపారు&period; రిజర్వేషన్‌లు మారతాయని&comma; తమ కుమారుడు గుత్తా అమిత్ రెడ్డికి ఎక్కడ అవకాశం వస్తే అక్కడి నుంచి పోటీలో ఉంటాడని ఆయన తెలిపారు&period; ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఎక్కడి నుంచి పోటీ చేస్తాడు అనేది చెప్పలేనని&comma; ఖచ్చితంగా పోటీలో అమిత్ ఉంటాడని గుత్తా సుఖేందర్ రెడ్డి చెప్పారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అంతరిక్ష రంగంలో తెలంగాణ గర్జన..

భద్రాచలంలో ముఖ్యమంత్రి ఫ్లెక్సీలకు అవమానం..

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..