పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, గల్ఫ్ దేశాల్లో ఉన్న లక్షలాది మంది భారతీయుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Advertisements

<p>పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ&comma; గల్ఫ్ దేశాల్లో ఉన్న లక్షలాది మంది భారతీయుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి&period; భారత ప్రభుత్వం ఇప్పటికే రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించింది&period; విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్&period; జైశంకర్ పార్లమెంటులో వెల్లడించిన సమాచారం ప్రకారం&comma; కేవలం గత వారం రోజుల్లోనే మార్చి 1 నుండి 7 వరకు దాదాపు 67&comma;000 మంది భారతీయులను ప్రత్యేక విమానాలు&comma; వాణిజ్య విమానాల ద్వారా స్వదేశానికి క్షేమంగా తీసుకువచ్చారు&period; ఇందులో తెలంగాణ &comma; ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారు అధిక సంఖ్యలో ఉన్నారు&period;<&sol;p>&NewLine;<p>తెలంగాణ ముఖ్యమంత్రి ఎ&period; రేవంత్ రెడ్డి గల్ఫ్ బాధితుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు&period; తెలంగాణ నుండి సుమారు 15 లక్షల మంది గల్ఫ్ దేశాల్లో ఉన్నట్లు అంచనా&period; సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి&comma; గల్ఫ్ కార్మికుల కుటుంబాలు ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు&period; విదేశీ వ్యవహారాల శాఖతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ&comma; గల్ఫ్ దేశాల్లోని వివిధ తెలుగు సంఘాలతో సంప్రదింపులు జరపాలని అధికారులను ఆదేశించారు&period; అత్యవసర పరిస్థితుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్లను కూడా అందుబాటులోకి తెచ్చింది&period;<&sol;p>&NewLine;<p>ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ప్రవాస ఆంధ్రుల భద్రత కోసం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది&period; ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు &ast; ఆంధ్రప్రదేశ్ నాన్-రెసిడెంట్ తెలుగు సొసైటీ రంగంలోకి దిగింది&period; ఇప్పటికే బహ్రెయిన్ &comma; దుబాయ్‌లో చిక్కుకుపోయిన సుమారు 107 మందిని ప్రత్యేక చొరవతో స్వరాష్ట్రానికి తీసుకువచ్చారు&period; ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 500 మందికి పైగా వ్యక్తులు క్షేమంగా ఇళ్లకు చేరుకున్నారు&period; క్షేత్రస్థాయిలో ఉన్న సుమారు 100 మంది గుడ్‌విల్ అంబాసిడర్లు గల్ఫ్ దేశాల్లో తెలుగు వారికి వసతి &comma; రవాణా సౌకర్యాలను కల్పిస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p>కేంద్ర ప్రభుత్వం కేవలం విమాన ప్రయాణాలే కాకుండా&comma; సముద్ర మార్గంలో చిక్కుకున్న నావికుల భద్రతపై కూడా దృష్టి పెట్టింది&period; ఢిల్లీలో 24&sol;7 పనిచేసే స్పెషల్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసి&comma; పశ్చిమాసియాలోని భారత రాయబార కార్యాలయాలతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు&period; ముఖ్యంగా ఎయిర్‌స్పేస్ పాక్షికంగా మూసివేసిన ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా భారతీయులను తరలిస్తున్నారు&period; కువైట్ నుండి రియాద్‌కు రోడ్డు మార్గంలో తరలించి&comma; అక్కడి నుండి విమానాల ద్వారా భారత్‌కు చేర్చే ప్రక్రియ కొనసాగుతోంది&period;<&sol;p>&NewLine;<p>ఉపాధి నిమిత్తం వెళ్ళిన వారి కంటే&comma; విజిటింగ్ వీసాపై వెళ్ళిన వారు &comma; విమానాశ్రయాల్లో చిక్కుకున్న వారు స్వదేశానికి తీసుకురావడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు&period; గల్ఫ్ దేశాల్లోనే ఉండి పనిచేస్తున్న వారు ప్రస్తుతానికి సురక్షితంగా ఉన్నారని&comma; అయితే స్థానిక అధికారుల ఆదేశాలను పాటించాలని రాయబార కార్యాలయాలు సూచిస్తున్నాయి&period; తెలంగాణ &comma; ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు తమ భవన్ల ద్వారా కూడా విమానాశ్రయానికి చేరుకున్న ప్రయాణికులకు అవసరమైన రవాణా ఏర్పాట్లు చేస్తున్నాయి&period; ప్రస్తుతానికి పరిస్థితి అదుపులోనే ఉన్నప్పటికీ&comma; యుద్ధం తీవ్రతరం అయితే భారీ ఎత్తున ప్రజలను తరలించేందుకు సిద్ధంగా ఉండాలని కేంద్రం అన్ని రాష్ట్రాలను కోరింది&period; యుద్ధ క్షేత్రం నుండి తిరిగి వస్తున్న వారిని చూసి గల్ఫ్ కార్మికుల కుటుంబాల్లో కొంత ఉపశమనం కనిపిస్తున్నా&comma; అక్కడ ఉండిపోయిన వారి గురించి ఇంకా ఆందోళన కొనసాగుతూనే ఉంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.

ఏడేళ్ల తరువాత భారత్ కు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్.

బ్రిక్స్ సదస్సు సందర్భంగా పుతిన్‌తో ప్రధాని మోదీ భేటీ.