పాత నోట్ల రద్దు

pata notla raddu

Advertisements

&NewLine;<p>రూ&period;2 వేల నోటు చలామణిని నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోట్లను మార్చుకునేందుకు సెప్టెంబర్ 30 వరకు గడువు ఇచ్చింది&period; మరో రెండు రోజుల్లో గడువు ముగియనుండడంతో మార్కెట్లో రూ&period;2 వేల నోటును వ్యాపారులు తీసుకోవడంలేదు&period; పెద్ద నోటు ఇస్తే చిల్లర లేదంటూ వద్దంటున్నారని పలువురు చెబుతున్నారు&period; మార్కెట్లో మాత్రమే కాదు ప్రభుత్వ సంస్థలలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది&period; తమిళనాడు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కూడా పెద్ద నోట్లు తీసుకోవద్దంటూ కండక్టర్లు&comma; డ్రైవర్లకు ఆదేశాలు జారీ చేసింది&period; గురువారం నుంచి రూ&period;2 వేల నోటును అంగీకరించ వద్దని చెప్పింది&period; నోట్ల మార్పిడికి గడువు దగ్గర పడడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది&period;<br>2016 నవంబర్ 8న రూ&period;500&comma; రూ&period;1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు&period; ప్రత్యామ్నాయంగా రూ&period;500 కొత్త నోట్లను&comma; రూ&period;2 వేల నోటును తీసుకురానున్నట్లు చెప్పారు&period; పాత నోట్ల రద్దు తర్వాత ఆర్బీఐ మార్కెట్లోకి విడుదల చేసిన రూ&period; 2 వేల నోటు తాత్కాలిక సౌలభ్యం కోసమేననే అభిప్రాయాలు అప్పట్లోనే వ్యక్తమయ్యాయి&period; దీనికి బలం చేకూర్చేలా 2019లో రూ&period;2 వేల నోట్ల ముద్రణను ఆర్బీఐ నిలిపి వేసింది&period; ఇటీవల ఈ నోటును చలామణిలో నుంచి తప్పిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..

మత్స్యపురిలో అక్రమ నిర్మాణాలు కూల్చివేతలు…