107
కంచికచర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో యువకుని పై జరిగిన దాడి కేసులో ఆరుగురు నిందితులను అరెస్టు చేయడం జరిగింది. నవంబర్ 1 తారీకు రాత్రి శ్యాం కుమార్ ను నిందితుడు హరీష్ శంకర్ మరియు ఐదుగురు స్నేహితులు దాడి చేసి బలవంతంగా కార్ ఎక్కించుకొని గుంటూరు వరకు తరలించారు. సంఘటనపై బాధితుడు ఫిర్యాదు చేయగా, ముగ్గురు ఇన్స్పెక్టర్లు మరియు ఎసిపి ఆధ్వర్యంలో స్పెషల్ టీంలు ఏర్పాటు చేసి రాత్రి నిందితులను అరెస్టు చేశాం. నిందితులపై కిడ్నాప్ కేసు, ఎస్సీ ఎస్టీ కేసు మరియు నాన్ బెయిలబుల్ కేసులు కూడా నమోదు చేశాం. నిందితులపై షీట్లు ఓపెన్ చేసి, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు చేపడతాం. ఈరోజు నిందితులను కోర్టులో ప్రవేశపెట్టాం.
Read Also..