బాపట్ల జిల్లా వెదుళ్ళపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నిరుపయోగంగా ఉన్న పోలీస్ క్వార్టర్స్ లో ఒక భవనాన్ని పునర్నిర్మించి పోలీస్ డాగ్ స్క్వాడ్ విభాగానికి అనుకూలంగా పోలీస్ జాగిలాలకు కెన్నెల్స్ ఏర్పాటు చేసి నవంబర్ 9న గురువారం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ప్రారంభించారు. సంప్రదాయబద్ధంగా వేదమంత్రాల నడుమ జరిగిన పోలీస్ డాగ్ స్క్వాడ్ భవనo ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ తీవ్రమైన నేరాలు జరిగినప్పుడు, మిస్టరీగా మారిన కేసులలో నిందితుల ఆచూకీ కనుగొనడంలో జాగిలాలు పాత్ర కీలకంగా ఉంటుందన్నారు. మనుషులకు సాధ్యం కాని పనిని జాగిలాలు సునాయాసంగా చేస్తూ నేర పరిశోధనలో పోలీస్ శాఖకు విశేష సేవలు అందిస్తున్నాయన్నారు. హత్యలు, దోపిడీలు, దొంగతనాలు జరిగిన సమయంలో నిందితులను పట్టించడం, పేలుడు పదార్థాలను గుర్తుంచడంలో జాగిలాల పాత్ర కీలకమైనదని తెలిపారు. జిల్లాలో ప్రస్తుతం టైగర్ (స్నిఫర్), ఫాక్సీ (ట్రాకర్), షాడో (ట్రాకర్), బిట్టు (స్నిఫర్), చెర్రీ (స్నిఫర్), బికో (స్నిఫర్) అను 6 జాగిలాలు ఉన్నాయన్నారు. జాగిలాలను సంరక్షించడానికి సరైన సదుపాయాలు లేకపోవడంతో జిల్లాలోని వెదుళ్ళపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నిరుపయోగంగా ఉన్న పోలీస్ క్వార్టర్స్ లోని ఒక భవనాన్ని పునర్నిర్మించి అందులో జాగిలాలకు అవసరమైన కెన్నెల్స్ నిర్మించి, జాగిలాలను సంరక్షించే సిబ్బంది ఉండడానికి కావలసిన అన్ని సౌకర్యాలను కల్పించడం జరిగిందన్నారు. పోలీస్ జాగిలాలు, వాటి సంరక్షకుల కొరకు నిర్మించిన “పోలీస్ డాగ్ స్క్వాడ్” భవనాన్ని ఈ రోజు ప్రారంభించడం జరిగిందన్నారు.
పోలీస్ డాగ్ స్క్వాడ్ భవనాన్ని ప్రారంభించిన జిల్లా ఎస్పీ
149
previous post