102
ఐసీసీ వన్డే వరల్డ్ కప్ లో ఇప్పటికే రెండు సెమీస్ బెర్తులు ఖరారయ్యాయి. టీమిండియా, దక్షిణాఫ్రికా సెమీస్ చేరాయి. ఇక మిగిలింది రెండు బెర్తులు… ఈ రెండు బెర్తుల కోసం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ జట్లు రేసులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో, టోర్నీలో నేడు ఎలాంటి ప్రాధాన్యం లేని మ్యాచ్ జరుగుతోంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరిందన్న నివేదికల నేపథ్యంలో, ఈ మ్యాచ్ జరగడంపై అనిశ్చితి నెలకొంది. అయితే, మ్యాచ్ జరిపేందుకే ఐసీసీ మొగ్గు చూపినట్టు తెలుస్తోంది.