Wednesday, July 22, 2026
News Navigation
Wednesday, July 22, 2026
News Navigation

Breaking

Wednesday, July 22, 2026
Home Andhra Pradesh కోడికత్తి కేసు విచారణ ఈనెల 15కు వాయిదా

కోడికత్తి కేసు విచారణ ఈనెల 15కు వాయిదా

by Prakash
Kodikatthi case hearing

ఏపీ హైకోర్టులో కోడికత్తి కేసు విచారణ జరిగింది. ఈ కేసులో నిందితుడు జనిపల్లి శ్రీనివాసరావు బెయిల్ కోరుతూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని ఎన్ఐఏను ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 6కు వాయిదా వేసింది. దీంతో ఏపీ హైకోర్టు శ్రీనివాసరావు బెయిల్ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఎన్ఐఏ ఈ కేసుకు సంబంధించి కౌంటర్ దాఖలు చేశారు. దీంతో తదుపరి విచారణను హైకోర్టు ఈనెల 15కు వాయిదా వేసింది. ఈ కేసులో నిందితుడు శ్రీనివాసరావు తరఫున న్యాయవాది సలీం వాదనలు వినిపిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు శ్రీనివాసరావుకు బెయిల్ రాలేదు. కోడికత్తి ఘటన జరిగినప్పటి నుంచి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులోనే ఉన్నాడు. దీంతో కుటుంబ సభ్యులు సైతం శ్రీనివాసరావుకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతున్నారు. ఈ మేరకు సీజేఐకు సైతం లేఖ రాసిన సంగతి తెలిసిందే.

Advertisements

You may also like

Our Visitor

042264
Total views : 223638

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: