Wednesday, July 22, 2026
News Navigation
Wednesday, July 22, 2026
News Navigation

Breaking

Wednesday, July 22, 2026
Home Latest News కొడంగల్ లో కొనసాగుతున్న సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.

కొడంగల్ లో కొనసాగుతున్న సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.

by CVR NEWS

కొడంగల్ లో సీఎం రేవంత్ రెడ్డి రెండోరోజు పర్యటన కొనసాగుతోంది. సర్ ప్రక్రియ ముగింపు దశకు చేరుకోవటంతో కొడంగల్ లో SIR ఫారంలో వివరాలు నమోదు చేసుకున్నారు. ఎన్యూమరేషన్ ఫారం భర్తీ చేసి BLOకి అందజేశారు సీఎం రేవంత్ రెడ్డి. సర్ ప్రక్రియపై సీఎం రేవంత్ సొంత నియోజకవర్గంలో ప్రత్యేక సమీక్షా చేసి స్థానిక నాయకులు, బిఎల్ఏలతో సమావేశమైయ్యారు. సర్ పక్రయ ఎలా సాగుతుందో తదితర పలు కీలక విషయాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. సర్ జరుగుతున్న తీరును సీఎంకు అధికారులు వివరించారు.

బీజేపీ, బీఆర్ఎస్ తప్పులు ప్రశ్నిస్తున్నందుకే తనపై కుట్ర చేస్తున్నారని సీఎం రేవంత్ ఆరోపించారు. కొడంగల్‌లో నేరుగా ఎదుర్కోలేక నన్ను దెబ్బతీసేందుకు కాంగ్రెస్‌కు ఓట్లు వేసినవాళ్ల ఓట్లు తొలగించేందుకుప్రయత్నిస్తున్నారన్నారు. కొడంగల్‌లో దెబ్బతీస్తే రాష్ట్ర స్థాయికి రాలేడు అని ఆలోచిస్తున్నారని విమర్శించారు సీఎం రేవంత్ . ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు 90శాతం కాంగ్రెస్‌కు ఓట్లు వేస్తారు. వారి ఓట్లు తొలగిద్దామని చూస్తున్నారన్నారు. కొడంగల్‌లో 78శాతం ఓటర్లు నమోదు చేసుకున్నారు. మిగిలిన 22 శాతం ఓట్లు నమోదు చేయించాలని సీఎం రేవంత్ సూచించారు. ఈనెలాఖరు నాటికి కొడంగల్‌లో 100శాతం ఎస్‌ఐఆర్‌ పూర్తి చేయాలని ఆదేశించారు. నాపై కుట్రలు చేసేవాళ్లను మీరే దెబ్బకొట్టాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి.

కొడంగల్లో సీఎం రేవంత్ తన నివాసం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు కాంగ్రెస్ శ్రేణులతో ర్యాలీ నిర్వహించారు. ఢిల్లీలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ ర్యాలీ, ధర్నా చేశారు. రాహుల్ గాంధీ అరెస్ట్ను సీఎం రేవంత్ రెడ్డి ఖండించారు. కొడంగల్ అంబేద్కర్ సర్కిల్లో సీఎం నిరసన వ్యక్తం చేశారు. సీఎం ర్యాలీకి కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

042261
Total views : 223582

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: