Wednesday, July 22, 2026
News Navigation
Wednesday, July 22, 2026
News Navigation

Breaking

Wednesday, July 22, 2026
Home Latest News నీట్ పేపర్ లీక్‌పై కేంద్రం సంచలన ప్రకటన.

నీట్ పేపర్ లీక్‌పై కేంద్రం సంచలన ప్రకటన.

by CVR NEWS

దేశ రాజధాని ఢిల్లీలో నీట్ పేపర్ లీక్ అంశం..పార్లమెంట్ లోపల, బయట తీవ్ర దుమారాన్ని రేపుతోంది. ఈ క్రమంలో జంతర్ మంతర్ వద్ద సీజేపీ నిరసన కొనసాగిస్తుండగా..పార్లమెంట్‌ ఉభయసభల్లో విపక్ష పార్టీల ఎంపీలు నీట్ పేపర్ లీక్ అంశంపై చర్చకు పట్టుబడుతున్నారు. దీంతో స్పందించిన కేంద్రం కీలక ప్రకటన చేసింది. లోక్‌సభలో పేపర్ లీక్ అంశంపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని కేంద్రం ప్రకటించింది. అయితే ప్రతిపక్ష పార్టీలు మాత్రం కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని పట్టుబడుతున్నారు. ఈ క్రమంలో లోక్ సభ 2 రెండు గంటల వాయిదా పడింది.

లోక్‌సభలో మాట్లాడిన పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు..నీట్ పేపర్ లీక్ విషయంపై చర్చకు ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉందన్నారు. తాము మూడు రోజులుగా చెబుతూనే ఉన్నామని.. చర్చలు నిబంధనల ప్రకారమే జరగాలని మొదటి రోజు నుంచే చెబుతున్నామన్నారు. చర్చ ఎప్పుడు జరగాలి, ఎంతసేపు జరగాలి, ఏ నిబంధనల ప్రకారం జరగాలి అనే విషయాలను అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో మాట్లాడిన తర్వాతే నిర్ణయించాలన్నారు. నీట్ పేపర్ లీక్ విషయంపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ దేశ యువత భవిష్యత్తు కోసం ఒక నిర్మాణాత్మక చర్చ జరగాలని..ప్రభుత్వం కోరుకుంటున్నది అదే అని తేల్చి చెప్పారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

042261
Total views : 223582

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: