Tuesday, June 16, 2026
News Navigation
Tuesday, June 16, 2026
News Navigation

Breaking

Tuesday, June 16, 2026
Home Latest News IPL చరిత్రలోనే అత్యధిక ధర పలికిన పంత్..

IPL చరిత్రలోనే అత్యధిక ధర పలికిన పంత్..

by Rama
IPL చరిత్రలోనే అత్యధిక ధర పలికిన పంత్..

దుబాయ్ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ మెగా వేలంలో భారత స్టార్ ప్లేయర్లు చరిత్రను తిరగ రాస్తున్నారు. వేలం స్టార్టింగ్ లోనే బౌలర్ అర్షదీప్ సింగ్‌ను పంజాబ్ జట్టు 18 కోట్లకు ఆర్టీఎమ్ చేసుకొగా.. అనంతరం స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ను ఏకంగా 26.75 కోట్లకు కొనుగోలు చేసింది. కాగా ఇదే ఐపీఎల్ చరిత్రలో ఓ ప్లేయర్ కు వెచ్చించిన అత్యధిక ధర గా నిలిచింది. కాగా ఈ రికార్డు బ్రేకింగ్ ధరను కొద్ది సేపటికే భారత మరో స్టార్ ప్లేయర్ రిషబ్ పంత్ తిరగరాశారు. రెండు కోట్ల బేస్ ప్రైజ్ తో వేలంలోకి వచ్చిన పంత్ ను కొనేందుకు మొదట ఆర్సీబీ, లక్నో జట్ల మధ్య పోటీ జరగ్గా.. 10 కోట్ల మార్కును దాటిన తర్వాత.. ఆర్సీబీ తప్పుకుంది.

అనంతరం రంగంలోకి వచ్చిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు.. పంత్ ను కోనేందుకు దాదాపు 20.50 కోట్ల వరకు వేలం పాడింది. అనంతరం పంజాబ్ జట్టు 20.75 కోట్లకు వేలం పాడగా.. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆర్టీఎమ్ చేసుకునేందు ముందుకు వచ్చింది. ఈ క్రమంలో అప్రమత్తమైన లక్నో జట్టు పంత్ కు ఏకంగా.. 27 కోట్లకు కోనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆర్టీఎమ్ చేసుకోవడం సాధ్యం కాలేదు. ఈ క్రమంలో భారత స్టార్ ప్లేయర్, ఢిల్లీ మాజీ కెప్టెన్ అయిన రిషబ్ పంత్ ఏకంగా 27 కోట్లకు అమ్ముడు పోయాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ప్లేయర్ గా కొద్ది క్షణాల క్రితం నిలిచిన శ్రేయస్ అయ్యర్ ను బీట్ చేసిన పంత్.. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడుపోయి చరిత్ర సృష్టించాడు. మొత్తానికి 27 కోట్లకు రిషబ్ పంత్ ను లక్నో జట్టు సొంతం చేసుకుంది.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • సోలార్ డ్రైయర్‌తో విలువ ఆధారిత ఉత్పత్తులు.
    సాంప్రదాయ వ్యవసాయం చేస్తూ… పండించిన పంటకు సరైన ధర రాక అప్పులపాలవుతున్న ఈ రోజుల్లో… మధ్యతరగతి రైతు తన వినూత్న ఆలోచనతో సరికొత్త విజయగాథను లిఖించారు. పంటను కేవలం పండించడమే కాదు… దానికి సాంకేతికతను జోడించి విలువ ఆధారిత ఉత్పత్తులుగా మారిస్తే…
  • నీట్ రీ -ఎగ్జామ్‍కు ముందు కేంద్రం సంచలన నిర్ణయం.
    నీట్ రీ ఎగ్జామ్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. టెలిగ్రామ్ యాప్‌పై తాత్కాలిక నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిషేధం జూన్ 22 వరకు వరకు కొనసాగుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. కొన్ని సైబర్ నేరగాళ్ల ముఠాలు,…
  • ఆర్డీఎస్ ఆనకట్టను పరిశీలించిన కేఆర్ఎంబీ ఇంజనీర్ల బృందం.
    జోగులాంబ గద్వాల జిల్లాలోని రైతులకు జీవనాడిగా భావించే రాజోలి బండ డైవర్షన్ స్కీమ్‌ అంశం మరోసారి ప్రాధాన్యత సంతరించుకుంది. కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్టను కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు ఇంజనీర్ల బృందం పరిశీలించి, మూడు రాష్ట్రాల అధికారులతో కీలక సమీక్ష నిర్వహించింది.…
  • సింగపూర్‍లో CBN @ 361 డిగ్రీస్ పుస్తకావిష్కరణ.
    ఏపీ సీఎం చంద్రబాబు పాలనా దక్షత, దార్శనికతపై రాసిన ‘సీబీఎన్@361 డిగ్రీస్.. పాలీమ్యాథ్’ అనే పుస్తకాన్ని సింగపూర్‌లో ఆవిష్కరించారు. కాకతీయ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని పుస్తకాన్ని విడుదల చేశారు. అనంతరం పుస్తకం…
  • భారత ప్రధానికి స్లోవేకియా దేశ అత్యున్నత పౌర పురస్కారం.
    భారత ప్రధాని మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం వచ్చి చేరింది. తాజాగా ఆయనకు స్లోవేకియా దేశ అత్యున్నత పౌర పురస్కారం లభించింది. స్లోవేకియా దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ది ఆర్డర్ ఆఫ్ ది వైట్ డబుల్ క్రాస్‌తో ప్రధాని మోదీని…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

024297
Total views : 144630

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.