ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న క్రికెట్ లవర్స్‌కు BCCI గుడ్ న్యూస్ చెప్పింది. IPL-2026 తొలి మ్యాచ్ వివరాలను అధికారికంగా ప్రకటించింది. మార్చి 28 నుంచి ఈ మెగా టోర్నీకి ప్రారంభం కానుంది. మొదట మార్చి 26వ తేదీన ఐపీఎల్ 2026 టోర్నమెంట్ ప్రారంభమవుతుందని ప్రచారం జరిగింది. కానీ పలు రాష్ట్రాల్లో ఎన్నికల దృష్ట్యా షెడ్యూల్ విడుదల కాస్త ఆలస్యమైంది. అయితే ఎన్నడూ లేని విధంగా సరికొత్తంగా ఈ సీజన్‌కు తెరలేవనుంది. ఈసారి రెండు గ్రూప్‌ల్లో ఈ టోర్నీని నిర్వహించనున్నారు. ప్రస్తుతానికి 20 మ్యాచ్‌లకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేశారు. ఏప్రిల్ 12 వరకు ఇవి కొనసాగనున్నాయి. మార్చ్ 28న ఈ సీజన్ తొలి మ్యాచ్ జరగనుండగా.. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాత్రి 7.30 లకు RCB, హైదరాబాద్ సన్ రైజర్స్ జట్లు తలపడనున్నాయి. సెకండ్ మ్యాచ్ మార్చ్ 29వ తేదీన ముంబై వేదికగాKKR వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య రెండో మ్యాచ్ ఉంటుంది. మొదటి దశ షెడ్యూల్లో ఆడే 10 జట్లు, తలో నాలుగు మ్యాచ్‌లు ఆడబోతున్నాయి.
#ipl
దుబాయ్ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ మెగా వేలంలో భారత స్టార్ ప్లేయర్లు చరిత్రను తిరగ రాస్తున్నారు. వేలం స్టార్టింగ్ లోనే బౌలర్ అర్షదీప్ సింగ్‌ను పంజాబ్ జట్టు 18 కోట్లకు ఆర్టీఎమ్ చేసుకొగా.. అనంతరం స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ను ఏకంగా 26.75 కోట్లకు కొనుగోలు చేసింది. కాగా ఇదే ఐపీఎల్ చరిత్రలో ఓ ప్లేయర్ కు వెచ్చించిన అత్యధిక ధర గా నిలిచింది. కాగా ఈ రికార్డు బ్రేకింగ్ ధరను కొద్ది సేపటికే భారత మరో స్టార్ ప్లేయర్ రిషబ్ పంత్ తిరగరాశారు. రెండు కోట్ల బేస్ ప్రైజ్ తో వేలంలోకి వచ్చిన పంత్ ను కొనేందుకు మొదట ఆర్సీబీ, లక్నో జట్ల మధ్య పోటీ జరగ్గా.. 10 కోట్ల మార్కును దాటిన తర్వాత.. ఆర్సీబీ తప్పుకుంది.
అనంతరం రంగంలోకి వచ్చిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు.. పంత్ ను కోనేందుకు దాదాపు 20.50 కోట్ల వరకు వేలం పాడింది. అనంతరం పంజాబ్ జట్టు 20.75 కోట్లకు వేలం పాడగా.. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆర్టీఎమ్ చేసుకునేందు ముందుకు వచ్చింది. ఈ క్రమంలో అప్రమత్తమైన లక్నో జట్టు పంత్ కు ఏకంగా.. 27 కోట్లకు కోనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆర్టీఎమ్ చేసుకోవడం సాధ్యం కాలేదు. ఈ క్రమంలో భారత స్టార్ ప్లేయర్, ఢిల్లీ మాజీ కెప్టెన్ అయిన రిషబ్ పంత్ ఏకంగా 27 కోట్లకు అమ్ముడు పోయాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ప్లేయర్ గా కొద్ది క్షణాల క్రితం నిలిచిన శ్రేయస్ అయ్యర్ ను బీట్ చేసిన పంత్.. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడుపోయి చరిత్ర సృష్టించాడు. మొత్తానికి 27 కోట్లకు రిషబ్ పంత్ ను లక్నో జట్టు సొంతం చేసుకుంది.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్.దాదాపు ఏడేళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత్‌లో పర్యటించే అవకాశం కనిపిస్తోంది. వచ్చే నెల 12, 13 తేదీల్లో ఢిల్లీలో జరగనున్న బ్రిక్స్ సదస్సులో ఆయన పాల్గొనే అవకాశమున్నట్లు సమాచారం. 2019లో చివరిసారిగా భారత్‌కు వచ్చిన షీ జిన్‌పింగ్,…
- పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం చిన్నలంక వద్ద సముద్రంలో బోటు బోల్తా పడిన ఘటన కలకలం రేపింది. సముద్ర వేటకు వెళ్లిన బోటు.. ఇసుకదిబ్బను ఢీకొనడంతో ఒక్కసారిగా బోల్తా పడింది. బోటులో ఉన్న ఏడుగురు మత్స్యకారులు సముద్రంలోకి దూకి.. ఈదుకుంటూ ఒడ్డుకు…
- 22ఏపై బీజేపీ దీక్షలు.భూ భారతి పేరుతో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. సెక్షన్ 22ఏ కింద లక్షలాది ఎకరాల భూములను ప్రొహిబిటెడ్ జాబితాలో చేర్చి రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. ధరణి పోర్టల్‌పై నిర్వహించిన…
- సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ద్వారకుంట సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. ముందు వెళ్తున్న కంటైనర్‌ను అత్యంత వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా..…
- భారత సైన్యం చేతికి ‘షేర్’.. ఏకే-203 రైఫిళ్లు రెడీ.రక్షణ రంగంలో ఆత్మనిర్భరత దిశగా భారత్ మరో కీలక ముందడుగు వేసింది. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ జిల్లా కోర్వాలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో దేశీయంగా తయారైన ఏకే-203 అసాల్ట్ రైఫిళ్లు భారత సైన్యానికి అందించేందుకు సిద్ధమయ్యాయి. త్వరలోనే వీటి డెలివరీ ప్రారంభం కానుంది. అత్యాధునికమైన…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి