123
మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ నేత బాలసాని లక్ష్మినారాయణ కుమారుడు వేణును హెచ్చిరిస్తూ మావోయిస్టులు లేఖ రాశారు. భూ సెటిల్మెంట్లు, గొడవలు సృష్టించి అమాయకపు ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాడని, అమాయక మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నాడని పేర్కొన్నారు. డబ్బులు వసూలు చేయడమే ఇతని పనిగా పెట్టుకున్నాడని మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికయినా తన వైఖరి మార్చుకోకపోతే బాలసాని వేణుకు.. అతని కుటుంబానికి ప్రజల చేతిలో శిక్ష తప్పదని హెచ్చరిస్తూ మావోయిస్టు పార్టీ వెంకటాపురం – వాజేడు ఏరియా కమిటీ కార్యదర్శి సుధాకర్ పేరుతో లేఖ విడుదల చేశారు.