బాల్య వివాహాలు అరికట్టాలి..

Child marriages

Advertisements

&NewLine;<p>జిల్లాలో బాల్య వివాహాలు పూర్తిగా నివారించి బాల్య వివాహాల రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ గిరీష పిఎస్&comma; శాసనసభ వ్యవహారాల సమన్వయకర్త&comma; ప్రభుత్వ విప్&comma; రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి&comma; మదనపల్లె ఎమ్మెల్యే నవాజ్ భాష&comma; జిల్లా ఎస్పీ కృష్ణారావు లు పేర్కొన్నారు&period;అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని నారాయణ కళ్యాణ మండపంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో బాల్య వివాహాల నివారణపై తహసిల్దార్లు&comma; ఎంపీడీవోలు&comma; ఎంఈఓలు&comma; సిడిపిఓలు&comma; అంగన్వాడి సూపర్వైజర్లు&comma; అంగన్వాడి వర్కర్లు&comma; డ్వాక్రామహిళలకు ఒకరోజు వర్క్ షాప్ నిర్వహించారు&period; ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయినప్పటికీ ఇంకా బాల్య వివాహాలు జరగడం చాలా బాధాకరమన్నారు&period; బాల్య వివాహాల వల్ల అమ్మాయి&comma; అబ్బాయి జీవితం నాశనం అవుతుందని తల్లిదండ్రులు గుర్తించాలన్నారు&period; సచివాలయాల పరిధిలోని మహిళా పోలీసులు&comma; పంచాయతీ సెక్రటరీలు&comma; ఏఎన్ఎంలు&comma; బాల్యవివాహాల వల్ల జరిగే అనర్థాల గురించి ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలన్నారు&period; ముఖ్యంగా ఎన్జీవోలు బాల్య వివాహాలు అధికంగా జరిగే ప్రాంతాలలో ప్రజలకు అవగాహన కల్పించి వివాహం చేసుకోబోయే అమ్మాయిలకు అబ్బాయిలకు కౌన్సిలింగ్ ఇవ్వాలన్నారు&period; చాలా పాఠశాలల్లో కేవలం పెళ్లి కోసమే అమ్మాయిలు డ్రాప్ అవుట్ అవుతుంటారని అమ్మాయిల డ్రాప్ అవుట్ లిస్టుపై ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు&period; ఆర్డీవోలు&comma; తహసిల్దార్ లు&comma; ఎంపీడీవోలు&comma; ఐసిడిఎస్&comma; వైద్యాధికారులు&comma; విద్య శాఖ అధికారులు సమన్వయంతో ప్రతి నెల క్రమం తప్పకుండా డివిజన్ స్థాయి&comma; మండలస్థాయి గ్రామస్థాయిలో బాల్య వివాహాల నిర్మూలనకు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు&period; వైద్య ఆరోగ్యశాఖ వారి నివేదిక ఆధారంగా ఈ మధ్య కాలంలో అన్నమయ్య జిల్లాలో 18 సంవత్సరాలు తక్కువ వయసు ఉన్న ప్రెగ్నెంట్ వుమన్ 350 మంది ఉన్నారని ఎప్పుడైతే 18 సంవత్సరాల లోపు ప్రెగ్నెన్సీ ఉమెన్ లేరని గుర్తించినప్పుడు చాలా వరకు బాల్యవివాహాలను నివారించిన వారమవుతామన్నారు&period; కావున ప్రతి ఒక్కరూ బాల్య వివాహాల నిర్మూలనకు తమ వంతు కృషి చేసి మన జిల్లాను బాల్య వివాహాల నిర్మూలన రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు తమ వంతు కృషి చేయాలన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్