బీజేపీలో చేరిన ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా, అశోక్‌ మిట్టల్, సందీప్ పాఠక్..

Advertisements

<p>ఆమ్ ఆద్మీ పార్టీ కి భారీ రాజకీయ ఎదురుదెబ్బ తగిలింది&period; పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు&comma; కీలక నేత&comma; రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా సహా మరో ఇద్దరు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరారు&period; ఢిల్లీలో సీనియర్ ఎంపీలు అశోక్ మిట్టల్&comma; సందీప్ పాఠక్‌లతో కలిసి రాఘవ్ చద్దా ఈమేరకు ప్రకటన చేశారు&period; 15 ఏళ్లుగా ఆప్‌కు అంకితభావంతో పనిచేశానన్నారు రాఘవ్ చద్దా&period; ఒకప్పుడు అవినీతి నిర్మూలన నినాదంతో అధికారంలోకి వచ్చిన పార్టీ ఇప్పుడు నిజాయతీ రాజకీయాలకు దూరమైందన్నారు&period; తాను సరైన వ్యక్తినే&comma; కానీ తప్పుడు పార్టీలో ఉన్నాననీ&&num;8230&semi; అందుకే పార్టీకి దూరమై ప్రజలకు దగ్గరవుతున్నాను రాఘవ్ చద్దా వ్యాఖ్యానించారు&period;తనతో పాటు మూడింట రెండొంతుల మంది ఆప్ పార్లమెంటరీ పార్టీ కూడా బీజేపీలో విలీనం అయ్యిందన్నారు&period;<&sol;p>&NewLine;<p>గత కొంతకాలంగా పార్టీలో రాఘవ్ చద్దా అసంతృప్తితో ఉన్నారు&period; ఇటీవల ఆయన్ను రాజ్యసభలో ఆప్ ఉప నాయకుడి పదవి నుంచి తొలగించి&comma; ఆ స్థానంలో అశోక్ మిట్టల్‌ను నియమించారు&period; ఈ పరిణామం పార్టీ అంతర్గత విభేదాలను బహిర్గతం చేసింది&period; ఈ నేపథ్యంలోనే చద్దా ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి&period; ఇప్పటికే పలు సవాళ్లను ఎదుర్కొంటున్న కేజ్రీవాల్ నాయకత్వానికి ఈ పరిణామం మరింత ఇబ్బందికరంగా మారింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.