భారత మాజీ నౌకాదళ సిబ్బందికి మరణశిక్ష..

Indian navy personnel

Advertisements

&NewLine;<p>గూఢచర్యానికి పాల్పడ్డారనే ఆరోపణలపై ఎనిమిది మంది భారత మాజీ నౌకాదళ సిబ్బందికి ఖతార్‌ కోర్టు మరణశిక్ష విధించడంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది&period; ఖతార్ కోర్టు తీర్పును షాకింగ్ పరిణామంగా విదేశాంగ మంత్రిత్వ శాఖ వ్యాఖ్యానించింది&period; కోర్టు ప్రొసీడింగ్స్ గోప్యతకు సంబంధించిన అంశం కావడంతో ఈ తీర్పుపై ఇంతకుమించి వ్యాఖ్యానించబోమని స్పష్టం చేసింది&period; అయితే తీర్పును వ్యతిరేకించబోతున్నామని హామీ ఇచ్చింది&period; మరణశిక్ష పడినవారు గతంలో ప్రధాన భారత యుద్ధ నౌకలకు కమాండింగ్ చేశారని భారత్ ప్రస్తావించింది&period; రిటైర్మెంట్ తర్వాత దహ్రా గ్లోబల్ టెక్నాలజీస్ అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ అనే ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నారని&comma; ఖతార్ సాయుధ బలగాలకు శిక్షణ&comma; సంబంధిత సేవలు అందిస్తున్నారని పేర్కొంది&period; వారిలో కొందరు అత్యంత సున్నితమైన ఇటాలియన్ టెక్నాలజీ ఆధారిత జలాంతర్గాములలో పనిచేస్తున్నారని&comma; ఎలాంటి గూఢచర్యానికి పాల్పడలేదని పేర్కొంది&period; తీర్పుకు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఎదురుచూస్తున్నామని&comma; కుటుంబ సభ్యులు&comma; న్యాయ బృందంతో మాట్లాడుతున్నామని వెల్లడించింది&period; మరణశిక్ష నుంచి వారిని తప్పించేందుకు అవకాశమున్న అన్ని చట్టపరమైన అవకాశాలను పరిశీలిస్తున్నట్టు కేంద్రం విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది&period; ఈ కేసుకు అధిక ప్రాధాన్యత ఇస్తామని&comma; అన్ని దౌత్య&comma; చట్టపరమైన మార్గాలను అనుసరిస్తామని తెలిపింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ట్రంప్‌ను టార్గెట్ నిందితుడి వీడియో వైరల్..

అమెరికాలో తెలుగు యువకుడు ఆత్మహత్య..

మ్యాప్ వివాదంలో చిక్కుకున్న నేపాల్ ఎయిర్‌లైన్స్ ..