రాజ్యసభ ఎన్నికలకు ముగిసిన నామినేషన్ ప్రక్రియ

Advertisements

<p>తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యులుగా కాంగ్రెస్ పార్టీ నుంచి అభిషేక్ మను సింఘ్వీ&comma; వేం నరేందర్రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు&period; ఎన్నికల అధికారి ఉపేందర్ రెడ్డికి నామినేషన్ పత్రాలు అందజేశారు&period; మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి&comma; శ్రీధ ర్ బాబు నేతృత్వంలో వారిద్దరూ నామినేషన్లు వేశారు&period; సీఎం రేపంత్ రెడ్డి&comma; పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో కలిసి రాజ్యసభ అభ్యర్థులు అభిషేక్ మను సింఘ్వీ&comma; వేం నరేందర్ రెడ్డి మూడో సెట్ నామినేషన్ పత్రాలను దాఖలు చేసారు&period; సిట్టింగ్ ఎంపీగా ఉన్న అభిషేక్ మను సింఘ్వీ పేరును కాంగ్రెస్ అధినాయకత్వం ఎంపిక చేసిన విషయం తెలిసిందే&period; రెండోస్థానంపై రాత్రి క్లారిటీ వచ్చింది&period; చర్చలు&comma; సం ప్రదింపుల తర్వాత వేం సరేందర్రెడ్డి పేరుసు ఖరారు చేశారు&period; ఈయనకు రాజ్యసభ అభ్యర్థి త్వం ఖరారు చేయాలని ముఖ్యమంత్రి రేవం త్రెడ్డి గట్టిగా కోరడం&comma; అందరితో సన్నిహిత సంబంధాలుండే నరేందర్రెడ్డి పేరుపై ఎవరి నుంచీ అభ్యంతరాలు వ్యక్తం కాకపోవడంతో అధిష్ఠానం కూడా చివరకు సీఎం మాటకే ప్రాధాన్యం ఇచ్చింది&period; ఇందులో మొదటి స్థానాని కి అభిషేక్ సింఘ్వీ ఎన్నికకు ఎలాంటి సమస్య లేదు&period; రెండో స్థానానికి అవసరమైన మెజార్టీ కాంగ్రెస్కు లేదు&period; ఎంఐంఎంపై ఆధారపడాల్సి ఉంటుంది&period; బీఆర్ఎస్ తరఫున ఎవరూ పోటీ లేకుంటే ఎన్నిక ఏకగ్రీవమవుతుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్‍లో ఏఐసీసీ చీఫ్ ఖర్గేను కలిసిన సీఎం రేవంత్ ..

గ్రేటర్ హైదరాబాద్‌ రాజకీయాల్లో కీలక పరిణామాలు..

జూన్ 2న హైదరాబాద్‍లో భారీసభ ఏర్పాటు ..