ఐదో రోజుకు చేరిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.

Advertisements

<p>తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఐదో రోజుకు చేరుకున్నాయి&period; గత రెండు రోజులుగా సభలో చోటుచేసుకున్న గందరగోళం&comma; నాటకీయ పరిణామాల నేపథ్యంలో నేటి సమావేశాలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి&period; స్పీకర్‌ పోడియంను ముట్టడించి నిరసన తెలిపినందుకు కేటీఆర్‌&comma; హరీశ్‌రావు సహా 22 మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్‌ చేయడంతో&period;&period; ప్రధాన ప్రతిపక్షం లేకుండానే సభ కొనసాగుతోంది&period;<&sol;p>&NewLine;<p>ఇక ఇవాళ సభలో 22ఏ నిషేధిత భూముల జాబితా అంశంపై సుదీర్ఘ చర్చ జరగనుంది&period; నిషేధిత జాబితా నుంచి భూములను తొలగించే అంశంపై సభ్యులు చర్చించనున్నారు&period; దేశవ్యాప్త జనగణనలో బీసీ కులాల కోసం ప్రత్యేక ఆప్షన్‌ చేర్చాలన్న డిమాండ్‌పై తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం ఉంది&period; కల్యాణలక్ష్మి&comma; షాదీముబారక్‌ పథకాల అమలు&comma; గురుకులాల్లో ఫుడ్‌ పాయిజనింగ్‌&comma; పాలిటెక్నిక్‌ కోర్సుల్లో మార్పులు&comma; ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలపై కూడా చర్చకు అవకాశం ఉంది&period;<&sol;p>&NewLine;<p>మరోవైపు అసెంబ్లీ వెలుపల జరిగిన ఉద్రిక్తతలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది&period; స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ను ఉద్దేశించి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ తాతా మధు చేసినట్లు చెబుతున్న వ్యాఖ్యల వెనుక కుట్ర కోణంపైనా విచారణ జరగనుంది&period; ఐపీఎస్‌ అధికారి విజయ్‌కుమార్‌ నేతృత్వంలో దర్యాప్తు కొనసాగనుంది&period; బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌ నేపథ్యంలో ఆ పార్టీ నేతలు నిరసనలు కొనసాగిస్తుండటంతో&period;&period; అసెంబ్లీ వెలుపల కూడా రాజకీయ వేడి కొనసాగే అవకాశం కనిపిస్తోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఢిల్లీ వేదికగా 18వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు.

పోలాండ్‌లో రోబోల వినూత్న నిరసన.

నవీ ముంబైలో ‘మహా గణేష్ మూర్తి వర్క్‌షాప్‌’.