రాష్ట్ర రాజకీయాల్లో పెనుదుమారం రేపిన ఫార్ములా ఈ-కార్ రేసు కేసు కీలక మలుపు తిరిగింది.

Advertisements

<p>రాష్ట్ర రాజకీయాల్లో పెనుదుమారం రేపిన ఫార్ములా ఈ-కార్ రేసు కేసు కీలక మలుపు తిరిగింది&period; ఈ వ్యవహారంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో సుదీర్ఘమైన ఛార్జిషీట్‌ను దాఖలు చేశారు&period; ఈ కేసులో మాజీ మంత్రి&comma; బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ను ప్రధాన నిందితుడిగా &lpar;A1&rpar; పేర్కొనడం అప్పట్లో సంచలనంగా మారింది&period;<&sol;p>&NewLine;<p>A1గా కల్వకుంట్ల తారక రామారావు &comma; మాజీ మంత్రి&period; A2గా అర్వింద్ కుమార్&comma; ఐఏఎస్ అధికారి&period; A3గా బి&period;ఎల్&period;ఎన్&period; రెడ్డి&comma; హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్&period; A4గా కిరణ్ మల్లేశ్వరరావు&comma; స్పోర్ట్స్ కన్సల్టెంట్&period; A5గాఎఫ్&period;ఈ&period;ఓ ఫార్ములా-ఈ ఆపరేషన్స్ &comma; యూకే సంస్థను చేర్చిచింది&period; ఈ వ్యవహారంలో నిబంధనలకు విరుద్ధంగా దాదాపు రూ&period;55 కోట్లను విదేశీ సంస్థలకు నేరుగా మళ్లించినట్లు ఏసీబీ ప్రాథమికంగా నిర్ధారించింది&period; ఫార్ములా ఈ-ఆపరేషన్స్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న &&num;8216&semi;ఏస్ నెక్స్ట్‌జెన్&&num;8217&semi; సంస్థకు బాధ్యతలు అప్పగించడం వెనుక భారీ కుట్ర దాగి ఉందని ఏసీబీ పేర్కొంది&period; దీనికి ప్రతిఫలంగా సదరు సంస్థ నుంచి బీఆర్ఎస్ కు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో రూ&period;45 కోట్లు అందాయని&comma; ఇది ముమ్మాటికీ &&num;8216&semi;క్విడ్ ప్రో కో&&num;8217&semi; కిందకే వస్తుందని అధికారులు ఛార్జిషీట్‌లో పొందుపరిచినట్లు తెలుస్తోంది&period;<&sol;p>&NewLine;<p>2023 ఫిబ్రవరిలో హుస్సేన్‌సాగర్ తీరాన జరిగిన ఫార్ములా-ఈ రేసు నిర్వహణలో భారీగా నిధుల దుర్వినియోగం జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దర్యాప్తునకు ఆదేశించింది&period; హెచ్‌ఎండీఏ నిధుల నుంచి రూ&period;160 కోట్లు మంజూరు చేసేలా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది&period; ఆర్బీఐ నిబంధనలను పక్కనపెట్టి 45&period;71 రూపాయల కోట్లను విదేశీ కరెన్సీ రూపంలో ఎఫ్&period;ఈ&period;ఓకు బదిలీ చేశారు&period; దీనిపై ఐటీ శాఖ అప్పట్లోనే 8&period;07 కోట్ల రూపాయల జరిమానా విధించింది&period; గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గతేడాది నవంబర్‌లో కేటీఆర్ ప్రాసిక్యూషన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఏసీబీ దర్యాప్తు వేగవంతం చేసింది&period; ఈ కేసులో ఇప్పటికే కేటీఆర్&comma; అర్వింద్ కుమార్ సహా ఇతర అధికారులను ఏసీబీ&comma; ఈడీ అధికారులు విచారించారు&period; విదేశీ సంస్థ ప్రతినిధులను ఆన్‌లైన్ ద్వారా ప్రశ్నించి వివరాలు సేకరించారు&period; నిధుల దుర్వినియోగం&comma; నేరపూరిత కుట్ర&comma; మోసం వంటి సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేస్తూ ఏసీబీ ఈ ఛార్జిషీట్‌ను సమర్పించింది&period;<br &sol;>&NewLine;నిధులు దుర్వినియోగం&comma; నిర్వహణకు సంబంధించిన టెండర్లలో అక్రమాలు జరగినట్టు ప్రతిపక్షాలు&comma; సామాజిక ఉద్యమ సంఘాలు విమర్శించాయి&period; ముఖ్యంగా ట్రాక్ నిర్మాణం&comma; నిర్వహణ కోసం ప్రైవేటు సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాల్లో అవినీతి జరిగిందని ఆరోపణలు వెల్లువెత్తాయి&period; రేసు వల్ల హుస్సేన్‌సాగర్ పర్యావరణం&comma; దాని చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు కలిగిన అసౌకర్యంపై కూడా ఆందోళనలు వ్యక్తమయ్యాయి&period; అలాగే&comma; క్యాబినెట్ ఆమోదం లేకుండానే రూ&period;54 కోట్లు చెల్లించారనేది ప్రధాన ఆరోపణ&period; ఇప్పటికే ఈ కేసులో విజిలెన్స్ కమిషన్‌కు ఏసీబీ నివేదికను సమర్పించింది&period; అలాగే&comma; ఈ వ్యవహారంపై ఈడీ కూడా కేసు నమోదు చేసింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.

అనకాపల్లి జిల్లాలో యలమంచిలిలో ప్రమాదం.